Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ బ్యాటింగే కాదు.. కీపింగ్ కూడా అదుర్స్: దినేశ్ కార్తీక్

Dinesh Karthik Lavishes Praise On Rishabh Pant Wicket Keeping in mohali test vs Sri Lanka

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో పంత్ బ్యాటింగ్‌తోనూ కాకుండా కీపింగ్‌లోనూ అదరగొట్టాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన భారత్.. ఇన్నింగ్స్ 222 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్(96) సూపర్ బ్యాటింగ్‌తో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. రిషభ్ పంత్‌ ఆటను కొనియాడాడు.

పంత్ కీపింగ్ సూపర్..

పంత్ కీపింగ్ సూపర్..

‘రిషభ్ పంత్ బ్యాటింగ్ గురించి మనందరికి తెలిసిందే. దాని గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ, వ్యక్తిగతంగా అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అద్భుతంగా కీపింగ్ చేశాడు. కొన్ని క్యాచ్‌లను అద్భుతంగా అందుకున్నాడు. ముఖ్యంగా నిస్సాంక క్యాచ్‌ను పట్టిన తీరు అమోఘం.

అది చాలా కష్టమైనా అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఎవరైనా ఆఫ్ స్పిన్నర్ రఫ్ పిచ్‌పై టర్న్ తీసుకునే బంతులు వేస్తే కీపర్‌కు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బంతి ఎటువైపు వెళ్తుందో అర్థంకాదు. అయినా పంత్ చాలా గొప్పగా కీపింగ్ చేశాడు. అది నన్ను బాగా ఆకట్టుకుంది.

పంత్ చాలా మెరుగయ్యాడు..

పంత్ చాలా మెరుగయ్యాడు..

వికెట్ కీపింగ్ సాధన చేసేటప్పుడు ఇలాంటి బంతులను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయంలో పంత్ చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది. పిచ్ స్వభావానికి తగ్గట్టుగా కీపింగ్ చేసేవారు చాలా చురుకుగా ఉండాలి. మ్యాచ్‌లో బంతులు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో తెలియదు. అలాంటప్పుడు వికెట్ కీపర్లు చాకచక్యంతో స్పందించాలి. అందుకోసం చాలా కష్టపడాలి.

ఈ విషయంలో పంత్ చాలా మెరుగయ్యాడని ఈ మ్యాచ్ ద్వారా అర్థమైంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా కీపింగ్ చేస్తున్నాడు.'అని దినేశ్ కార్తీక్ అభినందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తం 3 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మూడు కూడా రెండో ఇన్నింగ్స్‌లోనే అందుకోవడం విశేషం.

IND vs SL : Ravindra Jadeja Pays Tribute To Shane Warne With A Century | Oneindia Telugu
భారత్ ఘన విజయం..

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైన లంక.. ఫాలోఆన్‌లో 60 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నిశాంక (61 నాటౌట్‌; 133 బంతుల్లో 11×4), ఫాలోఆన్‌లో డిక్వెలా (51 నాటౌట్‌; 81 బంతుల్లో 9×4) కాస్త పోరాడారు. ఈ మ్యాచ్‌ సహా మొహాలిలో వరుసగా ఆడిన మూడు టెస్టుల్లోనూ జడ్డూనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలవడం విశేషం. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు (డేనైట్‌) శనివారం నుంచి బెంగళూరులో జరుగుతుంది.

Story first published: Monday, March 7, 2022, 17:00 [IST]
Other articles published on Mar 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+