Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, ధోనీ కాదు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 బ్యాటర్ అతనే: దినేశ్ కార్తీక్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ వికెట్ కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మెంటార్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని పేర్కొన్నాడు. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ షో‌లో సరదాగా జరిపిన చిట్ చాట్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 బ్యాటర్‌‌గా విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు.

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ, క్రిస్ గేల్‌‌, సూర్యకుమార్ యాదవ్‌, సురేశ్ రైనాలను కాదని విరాట్ కోహ్లీ పేరును దినేశ్ కార్తీక్ సూచించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారింది.

రేసులో లేని రోహిత్ శర్మ..

డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలో బెస్ట్ బ్యాటర్ ఎవరా? అని అడగ్గా.. దినేశ్ కార్తీక్ హిట్ మ్యాన్ పేరు సూచించాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్, క్రిస్ గేల్‌లో గొప్ప బ్యాటర్ ఎవరంటే.. యూనివర్సల్ బాస్ పేరును చెప్పిన దినేశ్ కార్తీక్.. ఏబీ డివిలియర్స్, బాబర్ ఆజామ్‌లో ఎవరు బెస్ట్ అంటే సౌతాఫ్రికా దిగ్గజం పేరు తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లో సూరీడిని ఎంచుకున్న దినేశ్ కార్తీక్.. కోహ్లీ, తిలక్ రత్న దిల్షాన్‌లో భారత మాజీ కెప్టెన్‌ను ఎంచుకున్నాడు. జోస్ బట్లర్, యువరాజ్ సింగ్‌లో సిక్సర్ల సింగ్‌ను ఎంచుకున్న కార్తీక్.. ధోనీ, నికోలస్ పూరన్‌లో మహీని, సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్‌లో రైనాను బెస్ట్ టీ20 బ్యాటర్‌గా పేర్కొన్నాడు.

రెండో రౌండ్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్‌లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే కార్తీక్ ఆశ్చర్యకరంగా గేల్‌కే ఓటేసాడు. ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్‌లో ఏబీడీని ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే.. కోహ్లీని ఎంచుకున్న దినేశ్ కార్తీక్.. ధోనీ, సురేశ్ రైనా‌ల్లో ధోనీకే ఓటేసాడు. మూడో రౌండ్‌లో క్రిస్ గేల్, ఏబీడీ, కోహ్లీ, ధోనీ మధ్య బెస్ట్ ఎవరంటే ఏబీడీ, కోహ్లీని ఎంచుకున్నాడు. ఫైనల్‌గా కోహ్లీ, ఏబీడీలో ఎవరు బెస్ట్ అంటే కోహ్లీనేనని దినేశ్ కార్తీక్ స్పష్టం చేశాడు.

Dinesh Karthik Hails Virat Kohli as the Greatest T20I Batter of All Time


టీ20ల్లో 14 వేల పరుగులు..

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం అంతర్జాతీయ టీ20లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2010లో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. 125 మ్యాచ్‌లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్ 137.04. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌లు ఆడి 39.55 సగటుతో 8661 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా 414 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 41.92 సగటుతో 13543 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలతో పాటు 105 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2006లో ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ఏబీ డివిలియర్స్.. 2017లో బంగ్లాదేశ్‌తో ఆఖరి మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 78 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఏబీడీ 1672 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడాడు. ఓవరాల్‌గా 340 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 150.13 స్ట్రైక్‌రేట్‌తో 9424 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, September 16, 2025, 20:50 [IST]
Other articles published on Sep 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+