
సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు. మూడో రోజైన ఆట పూర్తిగా సాగే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రతీ క్రికెట్ అభిమాని కలవర పడుతున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం అయితే లేదు కానీ మబ్బులు కమ్ముకున్నాయని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు.
కామెంటేటర్‌గా అవతారమెత్తిన కార్తీక్ కాకా.. ఎప్పటికిప్పుడు వెదర్ అప్‌డేట్స్ అభిమానులకు అందజేస్తున్నాడు. ఈ క్రమంలోనే మైదానానికి సంబంధించిన ఫొటోను పంచుకున్న కార్తీక్ కాకా.. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందున్న పరిస్థితని, ప్రస్తుతం మబ్బులున్నా.. తర్వాత మెరుగవుతుందని చెప్పాడు. అంతేకాకుండా మళ్లీ వర్షం వచ్చే అవకాశం లేదని చెప్పాడు.
ఇక కామెంట్రీ బాక్స్‌లో తనదైన వ్యాఖ్యానంతో సిక్స్‌లు బాదుతున్న ఈ తమిళనాడు క్రికెటర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రికెట్ వ్యాఖ్యానంలో ఓ దిగ్గజంగా భావించే హర్షా భోగ్లే సైతం కార్తీక్ కాకాను మెచ్చుకున్నాడు. కామెంటేటర్‌గా అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడని మెచ్చుకున్నాడు. దీనికి డీకే సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. సౌతాంప్టన్‌లో చాలా చల్లగా ఉందని, కానీ బ్రాడ్ కాస్ట్ బిజినెస్‌లో దిగ్గజమైన హర్షా నుంచి వచ్చిన మాటలు వింటే తనలో వేడి పుట్టిందని తెలిపాడు.
ఇక వీవీఎస్ లక్ష్మణ్ సైతం దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానాన్ని మెచ్చుకున్నాడు. కామ్ బాక్స్‌లో ఎవరైనా కార్తీక్.. దినేశ్ కార్తీక్ అని అంటే ట్విటర్‌లో దుమ్మురేపుతుందని తెలిపాడు. దీనికి కూడా కార్తీక్ కాక తనదైన శైలిలో బదులిచ్చాడు. 'బాండ్ జేమ్స్ బాండ్‌లా ఉంది సర్. కానీ నాకు భాష.. మాణిక్ భాష'అంటే ఇష్టమని రజనీ డైలాగ్ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్‌తో 44 బ్యాటింగ్), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై కింగ్ కోహ్లీ అదరగొట్టాడు. తనకే సాధ్యమైన ఆటతీరుతో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.