For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆకాష్ .. ఈ ఎక్స్‌ట్రాలే వద్దు!అందరూ బెన్ డకెట్‌లా ఉండరు: దినేశ్ కార్తీక్

టీమిండియా యువ పేసర్ ఆకాష్ దీప్‌‌ను మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మందలించాడు. మైదానంలో ఎక్స్‌ట్రాలు చేయవద్దని, అందరూ బెన్ డకెట్‌లా ఉండరని హెచ్చరించాడు. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆకాష్ దీప్.. హద్దులు దాటి ప్రవర్తించాడు. బెన్ డకెట్‌ను ఔట్ చేసిన తర్వాత ఆకాష్ దీప్ అతని భుజాలపై చేతులు వేసి ఏదో చెబుతూ సెండాఫ్ ఇచ్చాడు. ఆకాష్ దీప్ చర్యకు ఏ మాత్రం సహనం కోల్పోని బెన్ డకెట్‌ మౌనంగానే మైదానం వీడాడు.

సహజంగా బ్యాటర్ ఔటైన తర్వాత చాలా చికాకులో ఉంటాడు. ఇలాంటి సందర్భంలో బౌలర్ మందలించినా బ్యాటర్‌కు కోపం వస్తుంటుంది. అలాంటిది ఆకాష్ దీప్ ఎగతాళి చేస్తూ బెన్ డకెట్‌పై చేతులు వేసి మరి సెండాఫ్ ఇచ్చాడు. వెనకాలే వచ్చిన కేఎల్ రాహుల్.. బెన్ డకెట్‌పై నుంచి ఆకాష్ దీప్ చేతులు తీసేసాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Dinesh Karthik Criticizes Akash Deep s Send-Off to Ben Duckett in 5th Test vs England
Photo Credit: X (twitter)

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తీక్.. ఆకాష్ దీప్ తీరును తప్పుబట్టాడు. ఇలాంటి ఎక్స్‌ట్రాలే వద్దని హితవు పలికాడు. మరోవైపు సహనంగా ఉన్న బెన్ డకెట్‌ను మెచ్చుకున్నాడు. 'ఒక బ్యాటర్ ఔటైన తర్వాత ఇలా సెండాఫ్ ఇవ్వడం సరికాదు. బెన్ డకెట్ ప్రవర్తించిన తీరు మాత్రం అద్భుతం. అందరు బ్యాటర్లు ఇలా సహనంతో ఉండరు. 'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ కూడా ఆకాశ్ దీప్‌ను తప్పుబట్టాడు. ఇది అనవసరమని వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లోనూ బెన్ డకెట్ దూకుడుగా ఆడాడు. బజ్‌బాల్ గేమ్‌తో భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో తనకే సాధ్యమైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్, స్వీప్ షాట్స్‌తో బౌండరీలు బాదాడు. దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్‌(38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48)ను ఆకాష్ దీప్ పెవిలియన్ చేర్చాడు. అతని బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ ఆడబోయిన బెన్ డకెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో డకెట్ హాఫ్ సెంచరీ మిస్సవ్వగా.. తొలి వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జాక్ క్రాలీ(64)ని ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. ఓలీ పోప్(22)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 142 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో హ్యారీ బ్రూక్‌(4 బ్యాటింగ్‌)తో పాటు జోరూట్(8 బ్యాటింగ్) ఉన్నాడు.

Story first published: Friday, August 1, 2025, 19:04 [IST]
Other articles published on Aug 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+