Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన దినేశ్ కార్తీక్.. ధోనీ రికార్డ్ బద్దలు!

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ను దినేశ్ కార్తీక్ అధిగమించాడు.

ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం దినేశ్ కార్తీక్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సౌతాఫ్రికా 20 లీగ్‌లో అతన్ని పార్ల్ రాయల్స్ కొనుగోలు చేయడంతో ఆ టోర్నీ ఆడుతున్నాడు. సౌతాఫ్రికా 20 2025 సీజన్‌లో పార్ల్ రాయల్స్ ప్రధాన వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. దాంతో ఐపీఎల్ తర్వాత మేజర్ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లో భాగమైన భారత ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ నిలిచాడు.

Dinesh Karthik Creates History Surpasses MS Dhoni Record

డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే దినేశ్ కార్తీక్.. ధోనీ రికార్డ్‌ను అధిగమించాడు. ఇప్పటి వరకు దినేశ్ కార్తీక్ 409 టీ20 మ్యాచ్‌ల్లో 7451 పరుగులు చేశాడు. ధోనీ 391 టీ20ల్లో 7432 రన్స్ కొట్టాడు. సౌతాఫ్రికా20 లీగ్ ముందు ఈ రికార్డ్‌ను అధిగమించేందుకు దినేశ్ కార్తీక్‌కు 26 పరుగులు అవసరమవ్వగా.. అతను గత 8 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. గత 4 ఇన్నింగ్స్‌ల్లో అతను 19 పరుగులే నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(45), మార్కస్ స్టోయినీస్(55 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం పార్ల్ రాయల్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసింది. దినేశ్(15 బంతుల్లో 21) కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రుబిన్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Tuesday, January 28, 2025, 19:45 [IST]
Other articles published on Jan 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+