ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఎడిషన్ 2027 కూడా ఈ సిరీస్‌తోనే ప్రారంభమవ్వనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ వారసుడిగా టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలను శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు. ఈ సిరీస్‌తోనే అతని కెప్టెన్సీ కెరీర్ మొదలవ్వనుంది. టీమిండియా కాంబినేషన్‌తో పాటు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు? ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ క్రమంలో టీమిండియా కాంబినేషన్‌పై భారత మాజీ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ అంచనాలను పంచుకున్నారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించాలని సూచించారు. ఇలా చేస్తేనే జట్టుకు ప్రయోజనమని, అతన్ని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాలని పేర్కొన్నారు.

ముందుగా దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లుగా ఆడించాలని తెలిపాడు. సాయి సుదర్శన్‌ను ఫస్ట్ డౌన్‌లో.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని చెప్పాడు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐదో స్థానంలో.. కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో.. శార్దూల్ ఠాకూర్ 8వ స్థానంలో ఆడాలని తెలిపారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేరును దినేశ్ కార్తీక్ విస్మరించాడు. అతని కంటే శార్దూల్ బెస్ట్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను కార్తీక్ ఎంచుకున్నాడు.
దినేశ్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో అశ్విన్ ఒకే ఒక్క మార్పు చేశాడు. అది కూడా కరుణ్ నాయర్‌ను ఐదో స్థానంలో.. రిషభ్ పంత్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని చెప్పాడు. అశ్విన్ కూడా నితీష్ కుమార్ రెడ్డి పేరును విస్మరించడం గమనార్హం. ఇటీవల జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించడంతో అతనికే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దినేశ్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవెన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్, వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్(కీపర్, వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.