U19 World Cup 2022: అప్పుడు ధోనీ ....ఇప్పుడు బానా! మిగతా అంతా సేమ్ టూ సేమ్ (వీడియో)

హైదరాబాద్: 'ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మేగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇన్‌టూ ది క్రౌడ్! ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్ (ధోనీ తనదైన శైలిలో ముగించాడు. అద్భుతమైన షాట్‌తో బంతిని జనాల్లోకి పంపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ అందుకుంది)'అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడం క్రికెట్ అభిమానులందరికీ ఎంతలా గుర్తుంటుందో.. ధోనీ చివరి సిక్స్ కొట్టినప్పుడు కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంట్రీ కూడా అంతే గుర్తుండిపోయింది.
11 ఏళ్ల తర్వాత మళ్లీ..
సరిగ్గా 11 ఏళ్ల తర్వాతా అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. శనివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ బానా(5 బంతుల్లో 2 సిక్స్‌లతో 13 నాటౌట్) సూపర్ సిక్స్‌తో ధోనీ తరహాలో మ్యాచ్‌ను ముగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 12పరుగులు అవసరం కాగా.. 48వ ఓవర్‌లో నిశాంత్ సింధు బౌండరీ బాది సింగిల్ తీయగా.. స్ట్రైకింగ్‌లోకి వచ్చిన దినేశ్ బానా వరుస బంతుల్లో రెండు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ముగించాడు. అచ్చం ధోనీ తరహాలో లాంగాన్ మీదుగా సిక్సర్ బాది భారత్‌ను విశ్వవిజేతగా నిలిచాడు. కామెంటేటర్లు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బానాను ప్రశంసించారు. ఇక అభిమానులు ఈ రెండు వీడియోలను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.

టీమిండియా పాంచ్ పటాకా..
ఈ టోర్నీలో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన యువ భారత్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో యశ్ ధుల్ సారథ్యంలోని యువ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ రూ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు అద్భుత విజయాన్నందుకుంది.

దుమ్మురేపిన రాజ్ బావా..
ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (4/34) హడలెత్తించగా... రాజ్ బావా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో ఐదు వికెట్లు తీసిన రాజ్ బావా (5/31) ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ (54 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించాడు. వైస్ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీలు చేశారు. దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు నిశాంత్, రాజ్ 67 పరు గులు జోడించారు. ఓపెనర్ అంగ్‌క్రిష్ (0) డకౌట్ కాగా... హర్నూర్ (21; 3 ఫోర్లు), కెప్టెన్ యశ్ ధుల్ (17; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలువడం ఇది ఐదోసారి. భారత్ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications