టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నీ మైండ్ దొబ్బిందా'అంటూ మండిపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా వేసిన 32వ ఓవర్ ఐదో బంతిని జోస్ బట్లర్ డిఫెండ్ చేశాడు.
ఈ బంతిని అందుకున్న హర్షిత్ రాణా అనవసరంగా వికెట్ల వైపు బంతిని బలంగా విసిరాడు. అది కాస్త వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు అందకుండా బౌండరీ వైపు దూసుకెళ్లింది. దాంతో ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు అప్పనంగా 4 పరుగులు వచ్చాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్.. 'నీ మైండ్ ఏమైనా దొబ్బిందా'అని హిందీలో తిట్టాడు. కామెంటేటర్లు సైతం హర్షిత్ రాణా తీరును తప్పుబట్టాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.