బీసీసీఐ వెంటనే అతన్ని ఆసీస్‌కు పంపించాలి: మాజీ చీఫ్ సెలెక్టర్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా చేతిలో ఘోరా పరాజయాం పాలైన భారత జట్టును విజయాల బాట పట్టించాలంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెంటనే మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను అక్కడికి పంపించాలని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సూచించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ లోపాలను సరిచేయడం అతనొక్కడి వల్లే సాధ్యమన్నాడు. ఇక ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 36 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టైమ్స్ ఇండియాతో మాట్లాడిన వెంగ్‌సర్కర్.. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ రాణించాలంటే బీసీసీఐ వెంటనే ద్రవిడ్‌ను ఆసీస్‌కు పంపించాలని, అతని సేవలను నెట్స్‌లో వాడుకోవాలన్నాడు.

ద్రవిడ్ సేవలు అవసరం..
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న ద్రవిడ్.. జట్టుతో చేరితే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే భారత బ్యాట్స్‌మెన్ లోపాలను సరిచేయగలడని, ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సుమారు ఐదుగురు బ్యాట్స్‌మెన్ కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారని దిలీప్ గుర్తు చేశాడు. ‘బీసీసీఐ వెంటనే రాహుల్ ద్రవిడ్‌ను ఆస్ట్రేలియాకు పంపించాలి. ఆసీస్ పిచ్ పరిస్థితులపై బ్యాట్స్‌మెన్‌ను గైడ్ చేసే విషయంలో అతనికి మరెవరూ సాటిలేరు. అతను జట్టుతో చేరితో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం కూడా అమాంతం పెరుగుతుంది.

క్వారంటైన్‌లో ఉన్నా..
కరోనా కారణంగా ఎన్‌సీఏ గత తొమ్మిది నెలలుగా మూసివేయబడింది. దాంతో ఆటగాళ్లతో ద్రవిడ్ పెద్దగా టచ్‌లో లేడు. కాబట్టి ద్రవిడ్ సేవలను బీసీసీఐ జాతీయ జట్టుకు వాడుకోవాలి. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అతను అక్కడి వెళ్లడం ఎంతో ముఖ్యం. క్వారంటైన్ నిబంధనలు అడ్డొచ్చినా.. ద్రవిడ్ సేవలను జనవరి 7న ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు ఉపయోగించుకోవచ్చు.

పరువు కంగారులపాలు..
రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హాజల్‌వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్ (63 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications