Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాడేంటో.. వాడి ఆట ఏంటో అర్థం కావడం లేదు: మాజీ క్రికెటర్

రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు గుప్పించాడు. అసలు శ్రేయస్ అయ్యర్ ఏంటో, అతని ఆట ఏంటో అర్థం కావడం లేదన్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు ఫిట్‌గా లేని శ్రేయస్ అయ్యర్.. వైట్ బాల్‌ క్రికెట్ ఎలా ఆడుతున్నాడని ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియా-ఏతో అనధికార టెస్ట్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. రెండో మ్యాచ్‌కు ముందు జట్టు నుంచి తప్పుకున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో రెడ్ బాట్ క్రికెట్‌కు కొంత కాలం దూరంగా ఉంటానని బీసీసీఐకి సమాచారమిచ్చాడు. ఈ వార్తలను బోర్డు కూడా ధృవీకరించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికార టెస్ట్ ఆడని శ్రేయస్ అయ్యర్.. అదే జట్టుతో మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. నయా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అయ్యర్ డిప్యూటీగా కూడా వ్యవహరించనున్నాడు.

Dilemma and a Mystery Dilip Vengsarkar Slams Shreyas Iyer s First-Class Withdrawal

టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉండాలనే శ్రేయస్ అయ్యర్ నిర్ణయంపై తాజాగా మాట్లాడిన దిలీప్ వెంగ్‌సర్కార్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ నిర్ణయం నాకు కాస్త గందరగోళంగా ఉంది. ఎందుకంటే అతను రెడ్ బాల్ క్రికెట్‌కు ఫిట్‌గా లేనని చెప్పి విరామం తీసుకున్నాడు. కానీ వైట్‌బాల్ క్రికెట్‌కు ఫిట్‌గా ఉన్నానని చెబుతూ.. ఆడుతున్నాడు కూడా. అసలు రెడ్ బాల్, వైట్‌ బాల్ క్రికెట్‌కు మధ్య తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు. వైట్ బాల్ క్రికెట్‌కు ఫిట్‌గా ఉంటే రెడ్ బాల్ క్రికెట్ కూడా ఆడొచ్చనేది నా అభిప్రాయం. రెడ్ బాల్ లేదా వైట్ బాల్ క్రికెట్‌ను ఎంచుకోవడం నా అవగాహనకు మించిన అంశం.'అని దిలీప్ వెంగ్‌సర్కార్ సెటైర్లు పేల్చాడు.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ విజ్ఞప్తితోనే అతన్ని టెస్ట్ క్రికెట్‌ పరిగణలోకి తీసుకోవడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.'శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలల విరామం కావాలని బీసీసీఐని కోరాడు. యూకేలో వెన్ను ఆపరేషన్ చేయించుకొని పూర్తిగా కోలుకున్నప్పటికీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు నొప్పి తిరగబెట్టినట్లు అవుతుందని, కండరాలు బిగుసుపోతున్నాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే లాంగ్ ఫార్మాట్‌కు బ్రేక్ ఇచ్చి ఈ సమయాన్ని ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటానని తెలిపాడు. అతన్ని నిర్ణయాన్ని గౌరవిస్తూ టెస్ట్ ఫార్మాట్‌కు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఇరానీ కప్‌కు ఎంపిక చేయలేదు.'అని బీసీసీఐ తెలిపింది.

Story first published: Tuesday, October 7, 2025, 15:10 [IST]
Other articles published on Oct 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+