For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Digvesh Rathi: రాఘవ.. మనోడు ఏమి మారలే.!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో దిగ్వేష్ రతి తన ట్రేడ్ మార్క్ నోట్‌ బుక్ సెలెబ్రేషన్స్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్దంగా.. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించే విధంగా ఉన్న అతని సంబరాలను తప్పుబడుతూ భారీ జరిమానా, డిమెరిట్ పాయింట్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్నా.. అతని తీరు మారలేదు. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ దిగ్వేష్ రతి తన నోట్ బుక్ స్టైల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్(16)ను క్యాచ్ ఔట్‌ చేసిన వెంటనే.. పిచ్‌లో నోట్ చేసుకుంటున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'రాఘవ.. మనోడు ఏమి మారలే.!'అని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే..?
దిగ్వేష్ రతి వేసిన 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసింది. ఈ ఓవర్ నాలుగో బంతిని జోస్ బట్లర్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్.. ఎడమ వైపు డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే దిగ్వేష్ రతి పిచ్‌లో రాస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.

Digvesh Rathi does notebook celebration after Jos Buttler wicket in LSG vs GT IPL 2025 Match Video
Photo Credit: screen grab for JioHotstar

ప్రియాన్ష్ ఆర్య వికెట్‌తో..
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన అనంతరం దిగ్వేష్ రతి తొలి సారి నోట్‌ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన ప్రియాన్ష్ ఆర్యను క్యాచ్ ఔట్ చేసిన వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి నోట్‌బుక్‌లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలను తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్.. దిగ్వేష్ రతికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం అతని మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. అయినా అతను వెనక్కి తగ్గలేదు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నమన్ దీర్‌ను ఔట్ చేసి మళ్లీ నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. మళ్లీ అతని మ్యాచ్ ఫీజులో కొత పడటంతో నోట్ బుక్ సంబరాలను కాస్త మార్చుకున్నాడు. పిచ్‌పై రాసుకుంటున్నట్లు సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సీజన్‌లో దిగ్వేష్ రతి.. అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, అనికేత్ వర్మ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, సునీల్ నరైన్, జోస్ బట్లర్‌లను ఔట్ చేశాడు.

నోట్ బుక్ సెలెబ్రేషన్స్ ఆవిష్కర్త ఎవరంటే..?
గతంలో వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఇలానే సంబరాలు చేసుకునేవాడు. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అతన్ని చితక్కొట్టి.. నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌తో అతనికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమైంది. దాంతోనే నోట్‌బుక్ సెలెబ్రేషన్ ఐకానిక్‌గా నిలిచిపోయింది. తాజాగా దిగ్వేష్ రతి మరోసారి ఈ ఐకానిక్ సంబరాలను గుర్తు చేశాడు.

Story first published: Saturday, April 12, 2025, 18:32 [IST]
Other articles published on Apr 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+