Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli:భారత కెప్టెన్ తాగే బ్లాక్‌ వాటర్‌ సీక్రెట్ వెలుగులోకి.. ధర ఎంతో తెలుసా..?

 Did you know Virat Kohli drink expensive black water? Check price and other details
Black Water సీక్రెట్ ఇదే..అందుకే అంత ధర..! || Oneindia Telugu

ముంబై: ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మార్పులు తీసుకొచ్చాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ఫ్రాధాన్యమిస్తూ యావత్ దేశానికి స్పూర్తిగా నిలిచాడు. 2014 వరకు అందరిలానే ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయాడు. అతను చేసే వర్కౌట్‌ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే కోహ్లీ.. నీటి విషయంలోనూ అలానే ఉంటున్నాడు.

కోహ్లీ మినరల్‌ వాటర్‌‌కు బదులు 'బ్లాక్‌ వాటర్‌'ని తాగుతాడట. ఈ బాటిల్‌ లీటర్‌ ధర తెలిస్తే నోరెళ్ల బెడుతారు. ఎందుకంటే.. మినరల్ వాటర్‌ లీటర్‌ బాటిల్ ధర రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర రూ.3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి కోహ్లీ బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడట. కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్‌ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

దాంతో.. ఏంటి ఈ బ్లాక్ వాటర్..? ధర ఎంత..? అని నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. బ్లాక్‌ వాటర్‌లో సహజసిద్ధమైన అల్కలైన్‌ ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు మీ జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గుజరాత్‌లోని వడోదరలోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ '' ఎవోకస్‌'' పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారీని ప్రారంభించింది. భారత్‌లో విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుతం బ్లాక్ వాటర్ తాగుతున్న జాబితా కూడా గత కొన్ని నెలల నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ.. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమాయత్తం అవుతున్నాడు. గత రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో నిరాశపరిచిన కోహ్లీ.. మూడో టెస్ట్‌లోనైనా ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన సెండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది. మూడో టెస్ట్ కోసం లీడ్స్ చేరుకున్న కోహ్లీసేన.. హెడింగ్లే స్టేడియంలో ఆదివారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో శ్రమించారు.

Story first published: Monday, August 23, 2021, 10:20 [IST]
Other articles published on Aug 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+