T20 World Cup 2021: మెంటార్ ధోనీ మాట కోహ్లీ వినడం లేదా? టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది?

హైదరాబాద్: పాకిస్థాన్ ఓటమికి ముందు వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్! జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉండటంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశమని, కోహ్లీ-మహీ కాంబినేషన్‌ను ఎవరూ ఆపలేరని ప్రతీ ఒక్కరు చెప్పిన మాట.! వారన్నట్లుగానే రెండు వామప్ మ్యాచ్‌ల్లో భారత్ దుమ్మురేపింది. పటిష్టమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.! దాంతో పాకిస్థాన్‌పై కూడా భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా చరిత్ర కూడా ఇండియాకే ఫేవర్‌గా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమి గురించిన ఆలోచనే తట్టలేదు భారత అభిమానులెవ్వరికీ..! గెలవడం కంటే ఎలా గెలుస్తాం.. ఎంత తేడాతో గెలుస్తాం.. పాకిస్థాన్‌కు మరోసారి ఎంత వేదన మిగులుస్తాం అన్న లెక్కల్లోనే ఉన్నారంతా! ఎప్పట్లా మ్యాచ్ తర్వాత సంబరాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి.

ధోనీ మాట వినడం లేదా?
ఆట ఆరంభమయ్యే వరకు విజయానికి టీమిండియా ఎంతో దగ్గరగా.. పాకిస్థాన్ చాలా దూరంలో కనిపించాయి. కానీ ఆదివారం ఆ లెక్కలన్నీ మారిపోయాయి. రోహిత్ శర్మ డకౌట్‌తో మొదలైన పతనం చివరకు ఓటమి వరకు సాగింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి మెగాటోర్నీలో బోణీ కొట్టింది. ఈ పరాజయంతో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఇప్పుడు లీగ్ దశనైనా దాటుతుందా? అనే సందేహం కలుగుతుంది. అసలు మెంటార్ ధోనీ తన పనిని మొదలు పెట్టాడా? లేక అతని మాటను కోహ్లీ పట్టించుకోవడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ధోనీ టీమ్ కాదు..
భారత బ్యాటింగ్ విభాగం పర్వాలేదనిపించినా.. భారత బౌలర్లు మాత్రం ఎన్నడూ లేని విధంగా దారుణంగా విఫలమయ్యారు. 20 పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించారు. 152 పరుగుల లక్ష్యం చిన్నదేం కాదు. పైగా హై ఓల్టేజ్ మ్యాచ్‌లో చేజింగ్ అంత సులువేం కాదు. కానీ ఈ అడ్వాంటేజ్‌ను భారత బౌలర్లు అందిపుచ్చుకోలేకపోయారు. ముఖ్యంగా ఫస్ట్ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన 6, 4 పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ కాన్ఫిడెన్స్ పెంచింది. అయితే ఇక్కడ ఫామ్‌లో లేని భువనేశ్వర్‌కుమార్‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. భువీ విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ మధ్య తీవ్ర చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. టీమ్ కాంబినేషన్ విషయంలో ధోనీ పెద్దగా ఇన్వాల్స్ అయినట్లు అనిపించడం లేదు.

ఏకాభిప్రాయం కుదరడం లేదా?
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని ఎంపిక చేయడం, బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోకపోవడం వంటి నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. టీమ్ కాంబినేషన్ విషయంలో ధోనీ జోక్యం చేసుకోలేదు కాబట్టే శార్దూల్ తుది జట్టులోకి రాలేకపోయాడనే వాదన వినిపిస్తోంది. పైగా మ్యాచ్ అనంతరం శార్దూల్ ఎంపిక చేయకపోవడాన్ని కోహ్లీ సమర్థించుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. డ్యూ ప్రభావం ఉన్నప్పుడు స్లో బౌలర్లు ఏం చేయాలేరని కోహ్లీ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
వాస్తవానికి మెంటార్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టిన వెంటనే స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. అలాంటిది అతను తుది జట్టులో లేకపోవడంతో అభిమానులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. అసలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ బాగానే ఉందా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోహ్లీ, శాస్త్రి, ధోనీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరో ఘోర పరాభావం తప్పదా?
వీలైనంత త్వరగా ఈ సమస్యలను టీమిండియా అధిగమించకపోతే 2007 వన్డే ప్రపంచకప్ మాదిరి ఘోర పరాభవం ఎదురవుతుంది. అప్పుడు గ్రేగ్ చాపెల్ పనికిరాని ప్రయోగాలతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు టీమ్‌మేనేజ్‌మెంట్ సభ్యుల్లో ఉన్న బేధాభిప్రాయాలతో జట్టుకు నష్టం జరుగుతుందా? అనే భయం కలుగుతోంది. ఏదీ ఏమైనాప్పటికీ ఫస్ట్ ఓటమి నుంచి తేరుకొని రాణించాల్సిన అవసరమైతే ఉంది. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. వచ్చే ఆదివారం జరిగే న్యూజిలాండ్‌తో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఓడితే లీగ్‌లో ముందంజ వేయలేని పరిస్థితి. మరీ ఎంతో అనుభవం ఉన్న మహేంద్రుడు.. మెంటార్‌గా తన మార్క్‌ను ఈ మ్యాచ్‌లోనైనా చూపిస్తాడో లేదో చూడాలి.!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications