For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వ్యాఖ్యలే డేవిడ్ వార్నర్ కొంపముంచాయా?

Did Sunrisers Hyderabad sack captain David Warner for questioning selectors?
IPL 2021 : SRH Remove Warner కెప్టెన్‌గా Kane Williamson || Oneindia Telugu

హైదరాబాద్: మనీష్ పాండే‌‌ను తుది జట్టులో నుంచి తప్పిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలే అతని కొంపముంచాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పరాజయం అనంతరం మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ తనను సంప్రదించకుండా తుది జట్టు నిర్ణయాలు తీసుకుందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు నుంచి మనీష్ పాండేను ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు.. 'మనీష్ పాండేకు తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అది కఠినమైన నిర్ణయం. అయితే అది సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం. నేనేమీ చేయలేను. పాండేను పక్కనపెట్టడం నాకిష్టం లేదు' అని వార్నర్ స్పష్టం చేశాడు.

అయితే ఆ సెలెక్టర్లు ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే టామ్ మూడీ, ట్రెవర్ బేలిస్, బ్రాడ్ హాడిన్, వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ సన్‌రైజర్స్ కోచింగ్ బృందంలో ఉన్న విషయం తెలిసిందే. వార్నర్ వ్యాఖ్యలతో వీళ్లంతా ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా టీమ్‌మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు బేధాభిప్రాయాలున్నాయనే సంకేతాలనిచ్చింది. అంతేకాకుండా కెప్టెన్‌గా వార్నర్ నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం లేదనే విషయం కూడా స్పష్టమైంది. ఈ క్రమంలో వీరి మధ్య దూరం పెరిగి.. చివరకు కెప్టెన్సీపై వేటు వేసే వరకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

వార్నర్ వ్యతిరేక గళానికి తోడు అతని పేలవమైన బ్యాటింగ్‌ కూడా ఫ్రాంచైజీ కఠిన నిర్ణయం తీసుకునేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చెన్నైతో మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ సైతం వార్నర్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో కూడా వార్నర్ విఫలమయ్యాడని విమర్శించాడు.

ఇక డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ను సారథిగా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ నుంచే విలియమ్సన్ జట్టు సారథ్య బాధ్యతలు చేపడుతాడని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని, ఈ మేరకు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ లెక్కన తుది జట్టులో కూడా వార్నర్ చోటు కోల్పోనున్నాడు. అతని స్థానంలో జాసన్ రాయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

Story first published: Saturday, May 1, 2021, 20:40 [IST]
Other articles published on May 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+