
గంగూలీ చెప్పినా..
టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ముందుగానే ప్రకటించాడు. వద్దని తాము ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదని గంగూలీ చెప్పాడు. 'విరాట్ స్థానంలో రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడమనేది బోర్డు సెలెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. నిజానికి టీ20 కెప్టెన్సీ వదులుకవద్దని విరాట్‌ను మేం చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ కోహ్లీ మా మాటకు ఒప్పుకోలేదు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించారు.

ఇద్దరు కెప్టెన్లు..
వన్డే, టీ20లకు వేర్వేరు లీడర్లు ఉండటం కన్ఫ్యూజన్‌కు దారి తీస్తుందనుకున్నారు. అందుకే ఒకే కెప్టెన్ ఉంటే మంచిదని.. రోహిత్‌ను కెప్టెన్ చేశారు. టెస్ట్ జట్టుకు విరాట్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఈ విషయాలపై బోర్డు ప్రెసిడెంట్‌గా నేను, సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా కోహ్లీతో పర్సనల్‌గా మాట్లాడాం. పూర్తి వివరాలు చెప్పలేను గానీ రోహిత్‌ను వైట్ బాల్ కెప్టెన్ చేయడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే. అందుకు విరాట్ కూడా ఒప్పుకున్నాడు.'అని దాదా చెప్పుకొచ్చాడు.

కాకమ్మ కథలు చెప్పకండి..
అయితే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా వన్డే, టెస్ట్ సారథిగా కొనసాగుతానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మరీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గంగూలీ రిక్వెస్ట్ చేసినప్పుడే.. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు విధానం భారత క్రికెట్‌కు సెట్ కాదని చెబితే కోహ్లీ తప్పుకునేవాడు కాదు కదా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎంతి చెప్పినా వినలేదని గంగూలీ చెప్పే మాటటు నమ్మశక్యంగా లేవంటున్నారు. కోహ్లీని తప్పుకునేలా చేసి, ఇప్పుడు చెబితే వినలేదనే సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..
మరోవైపు రోహిత్ శర్మ తన సొంత పీఆర్ టీమ్‌తో సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారని ఆరోపిస్తున్నారు. పదే పదే ఐపీఎల్ రికార్డ్స్ ప్రస్తావిస్తూ కోహ్లీని మానసికంగా వేదించారని, ముంబై మాజీ క్రికెటర్ల లాబియింగ్‌తో విరాట్‌పై అనవసర విమర్శలు చేయించారని మండిపడుతున్నారు. కోహ్లీ వెనుకాల ఉంటూనే రోహిత్ అతని కెప్టెన్సీకి గోతులు తవ్వాడని ఆరోపిస్తున్నారు. ఇక కోహ్లీని జట్టు నుంచి సాగనంపే ప్రయత్నం కూడా వీరు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
