Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెయిల్స్ కాదు.. ధ్రువ్ జురెల్ స్టంప్స్ మార్చినా ఔటవ్వలేదు!(వీడియో)

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. సోనాల్ దినుషా అద్వితీయమైన శతకంతో భారత విజయవకాశాలను దెబ్బతీసాడు. టెయిలెండర్స్ కేశర నువాంత(46), లాహిరు కుమార(12), అసితా ఫెర్నాండో(0 బ్యాటింగ్)తో కలిసి భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు.

అతని జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లు, ఫీల్డర్లు తీవ్ర అసహనానికి గురయ్యాడు. కేశర నువాంతతో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించిన సోనాల్ దినుషా.. లాహిరు కుమార(12)తో కలిసి 9వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో అతను 196 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!
Dhruv Jurel Hilariously Flips Entire Stumps During Sonal Dinusha s Century Knock in Colombo Test

సోనాల్ దినుషాను ఔట్ చేయడానికి భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలర్లతో పాటు ఫీల్డ్ సెటప్ మార్చినా.. చివరకు తానే స్వయంగా బౌలింగ్ చేసినా లాభం లేకపోయింది. తీవ్ర చికాకు గురైన ధ్రువ్ జురెల్ అయితే బ్లాక్ మ్యాజిక్ కూడా ప్రయత్నించాడు.

సాధారణంగా బ్యాటర్లను ఔట్ చేసేందుకు బెయిల్స్‌ను మారుస్తుంటారు. కానీ ధ్రువ్ జురెల్ ఏకంగా స్లంప్స్‌నే మార్చాడు. అయినా ఫలితం లేకపోయింది. ధ్రువ్ జురెల్ స్టంప్స్ మార్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి రోజు ఆట మూడో సెషన్ కూడా ప్రారంభం కాగా.. ఆఖరి వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక ఆధిక్యం 200+ పరుగులకు చేరడంతో భారత్ విజయం సాధించడం కష్టమే. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను భారత్ చేజేతులా చేజార్చుకుంది.

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

Also Read

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

సోనాల్ దినుషాను ఔట్ చేయలేక.. డ్రాకు తల వంచింది. శ్రీలంకను ఫాలో-ఆన్ ఆడించడం కూడా టీమిండియాకు నష్టం చేసింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం పెట్టి బ్యాటింగ్ చేయించి ఉంటే.. ఒత్తిడిలో వారు ఔటయ్యేవారు. కానీ ఫాలో-ఆన్ ఆడించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసింది. పిచ్ కూడా నిర్జీవంగా మారిపోయింది. సాధారణంగా ఆఖరి రోజు పిచ్ స్పిన్‌కు అనుకూలించాలి. కానీ ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన శ్రీలంక.. తమకు అనుకూలమైన వికెట్‌ను సిద్దం చేసుకుంది. ఈ విషయాన్ని గ్రహించడంలో భారత మేనేజ్‌మెంట్ విఫలమైంది.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ (దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 ఆలౌట్(పసిందు సూర్యబండార 80, సోనాల్ దినుషా 103)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/*(పసిందు సూర్యబండార 92, కామిందు మెండీస్ 55, సోనాల్ దినుషా 133 బ్యాటింగ్)

Story first published: Thursday, August 27, 2026, 17:00 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+