Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ప్రీతి జింటా

ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్‌ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అందరికంటే ముందు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు వెళ్తుందనుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. ముంబై ఇండియన్స్‌‌తో గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ ఓటమిపాలైంది.

ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం. దాంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ ప్లేస్‌ను ఖరారు చేసుకోవాలంటే పంజాబ్ కింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొంపముంచిన ఓనర్స్..

పంజాబ్ కింగ్స్ ఓనర్స్ నిర్ణయం ఆ జట్టు కొంపముంచింది. ధర్మశాల‌ను తమ రెండో వేదికగా ఎంచుకోవడం పంజాబ్ కింగ్స్‌ను దెబ్బతీసింది. రెగ్యులర్‌గా పంజాబ్ కింగ్స్ ముల్లాన్‌పూర్‌లో తమ హోమ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సీజన్‌లో ఇక్కడ 5 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఓటమిపాలైంది.

Dharamsala Double Disaster How Preity Zinta and Ness Wadia s Second Venue Move Cost PBKS Dearly in Playoff Race

తమ చివరి రెండు హోమ్ మ్యాచ్‌లను ధర్మశాల వేదికగా ఆడగా.. ఈ పిచ్ కండిషన్స్ పంజాబ్ కింగ్స్‌కు కలిసి రాలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం పంజాబ్‌కు నష్టం చేసింది. అంతేకాకుండా ఇక్కడి విభిన్నమైన పిచ్ కండిషన్స్ పంజాబ్‌కు పరీక్షగా మారాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 210 పరుగులు చేసినా.. ముంబై ఇండియన్స్‌తో 200 పరుగులు చేసినా పంజాబ్ గెలవలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో బంతి ముద్దుగా బ్యాట్‌పైకి రావడంతో పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ముల్లాన్‌పూర్ వేదికగా జరిగి ఉంటే పంజాబ్ గెలిచేదని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ధర్మశాలలో మ్యాచ్‌లు ఎందుకంటే..?

హిమాచల్ ప్రదేశ్ అభిమానుల‌తో పాటు టూరిజానికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంలో పంజాబ్ కింగ్స్ తమ సెకండ్ హోమ్ గ్రౌండ్‌గా ధర్మశాలను ఎంచుకుంది. ఐపీఎల్ క్రేజ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు ఈ అవకాశం కల్పించింది. ఇతర జట్లు కూడా తమ సెకండ్ హోమ్ గ్రౌండ్స్‌ను ఎంచుకున్నాయి.

ధర్మశాల క్రికెట్ స్టేడియం సముద్ర మట్టానికి దాదాపు 1,457 మీటర్ల ఎత్తులో, అందమైన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని మైదానం కారణంగా ఇక్కడ ఆడేందుకు ఆటగాళ్లు, మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. టూరిజం పరంగా కూడా ఇది ఐపీఎల్‌కు పెద్ద అస్సెట్.

ఏప్రిల్, మే నెలల్లో భారతదేశంలోని మిగతా నగరాల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల టోర్నీ చివరి దశకు వచ్చేసరికి (మే నెలలో) ఇక్కడ మ్యాచ్‌లు ఆడటం ఆటగాళ్లకు కూడా కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది.

Story first published: Friday, May 15, 2026, 16:52 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+