Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెగించేసిన ధనశ్రీ వర్మ.. వైరలవుతున్న చాహల్ సతీమణి క్యూట్ అందాలు!

Dhanashree Verma Wife Of Yuzvendra Chahal Beautiful Pics Goes Viral On Internet
Photo Credit: Instagram

హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ.. పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. గత వారం రోజులుగా ఆమెపై అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. భర్త చాహల్‌కు హ్యాండిచ్చి యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ప్రేమాయణం నడుపుతుందనే పుకార్లు వెలువడ్డాయి. సోషల్ మీడియా వేదికగా చాహల్, ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్‌లు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. న్యూ లైఫ్ లోడింగ్ అంటూ చాహల్ పోస్ట్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చాహల్'అనే తన సర్‌నేమ్‌ను ధనశ్రీ తొలగించింది. దాంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.

డాక్టర్ ధనశ్రీ..

డాక్టర్ ధనశ్రీ..

స్టార్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ధనశ్రీ.. డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌గా అవతారమెత్తింది. ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ 2014లోనే నవీ ముంబైలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. కొన్నిరోజుల పాటు డెంటిస్ట్‌గా పనిచేశారు.

డాక్టర్ కూతురు..

డాక్టర్ కూతురు..

అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఇష్టం. అందుకే డాక్టర్ వృత్తిని వదిలేసింది. ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీని కూడా ప్రారంభించింది.అంతేకాకుండా సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా మొదలుపెట్టింది. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లను ఎప్పటికప్పుడూ అప్‌లోడ్ చేస్తోంది. ఇక ట్విటర్, ఇన్‌స్టాలో ధనశ్రీని చాలా మంది అనుసరిస్తున్నారు. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్‌. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధనశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు.

డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయమై..

డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయమై..

డ్యాన్స్ నేర్చుకోవాలని భావించిన చాహల్.. ఆన్‌లైన్‌లో నేర్పించే వారి కోసం అన్వేషించాడు. అప్పుడు అతనికి ధనశ్రీ పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త పరిణయంగా మారింది. చాలా సరదాగా ఉండే చాహల్‌కు ధనశ్రీ చాలా దగ్గరయ్యింది. కొన్నాళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. చాలా అన్యోన్యంగా ఉంటూ సెలబ్రిటీల అందరికి ఆదర్శంగా నిలిచారు.

డబుల్ అయిన క్రేజ్

డబుల్ అయిన క్రేజ్

చాహల్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే ధనశ్రీ గ్యాలరీలో తనదైన శైలిలో సంబరాలు చేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేది. చాహల్‌తో వెళ్లిన ప్రతీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసేది. చాహల్ కారణంగా టీమిండియా ఆటగాళ్లకు క్లోజ్ అయిన ధనశ్రీ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలతో కలిసి డ్యాన్స్‌లు చేసింది. ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంది. చాహల్‌తో పెళ్లయిన తర్వాత ధనశ్రీకి పాపులారిటీ మరింత పెరిగింది.

అయ్యర్‌తో అఫైర్...

అయ్యర్‌తో అఫైర్...

అదిరే డ్రెస్సుల్లో తన అందాలను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేసింది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానుల మనసులను గెలుచుకుంది. అభిమాన గణం పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌తో చనువు ఎక్కువవడంతో అభిమానులకు సందేహాలు మొదలయ్యాయి. సూర్య ఇచ్చిన పార్టీకి చాహల్‌తో కాకుండా అయ్యర్‌తో హాజరవ్వడం తీవ్ర దుమారం రేపింది.

Story first published: Friday, August 19, 2022, 15:37 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+