Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dhanashree Verma:నేను అలాంటిదాన్ని కాదు.. మా ఆయన బాధపడుతున్నాడు!

సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆపేయాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నెటిజన్లను కోరింది. విద్వేశాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమను పంచాలని రిక్వెస్ట్ చేసింది. అందరు అనుకుంటున్నట్లుగా తాను తప్పుడు మనిషిని కాదని, కుటుంబానికి విలువనిచ్చే వ్యక్తినని పేర్కొంది.

సోషల్ మీడియా జరిగే ట్రోలింగ్, తనపై వచ్చే మీమ్స్, సెటైర్స్‌కు తాను ఏ మాత్రం భయపడనని, వాటిని చాలా సరదాగా తీసుకుంటానని కూడా చెప్పింది. కానీ ఇటీవల ఈ ట్రోలింగ్ హద్దులు ధాటిందని, దాని వల్ల తన కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురువుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

Dhanashree Verma Slams Social Media Trolls Says I m Also Just A woman Like Your Mother Sister

కొరియోగ్రాఫర్‌తో సన్నిహితంగా..
ధన్మశ్రీ వర్మ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ షో సందర్భంగా ధనశ్రీ వర్మ‌ను హగ్ చేసుకున్న ఓ ఫోటో‌ను కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటో‌లో ధనశ్రీ వర్మ.. ప్రతీక్ ఉతేకర్ సన్నిహితంగా ఉండటంతో వైరల్‌గా మారింది.

పెళ్లయిన ధనశ్రీ వర్మ మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకు? అని నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. సీక్రెట్ ఎఫైర్స్ నడిపిస్తూ చాహల్‌ను మోసం చేస్తుందని కామెంట్స్ చేశారు. గతంలో టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కూడా ధనశ్రీ వర్మ వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రచారం చేశారు.

ట్రోలింగ్ వద్దు..
ఈ జుగుప్సాకరమైన ట్రోలింగ్‌తో విసిగిపోయిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆన్‌లైన్ ట్రోలింగ్ చేయవద్దని, తాను ఓ మహిళనని పేర్కొంది. 'ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు నేను ఎప్పుడూ ప్రభావం కాలేదు. నాపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌ను పరిణితితో చూసి నవ్వుకునేదాన్ని. కానీ ఈ సారి ట్రోల్స్‌తో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఎందుకంటే నా కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతుంది.

సోషల్ మీడియా వేదికల్లో ఏదైనా మాట్లాడే స్వేచ్చ ఉండటంతో మా కుటుంబం యొక్క మనోభావాలను పట్టించుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. లేకుంటే ద్వేషం, అసమానత వ్యాప్తి చెందుతోంది. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను ఈ వేదికను విడిచిపెట్టలేను.

మీ చెల్లిలానే..
అందుకే నేను ధైర్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాట్లాడేందుకు వచ్చాను. సోషల్ మీడియా వేదికగా కాస్త సెన్సిటివ్‌గా ఉంటూ మా ప్రతిభ, నైపుణ్యాలపై మాత్రమే ఫోకస్ పెట్టండి. మేమంతా మిమ్మల్ని అలరించేందుకే ఈ వేదికను ఉపయోగిస్తున్నాం. కాబట్టి నేను కూడా మీ తల్లి, సోదరి, సతీమణిలా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోవద్దు.

నేను ఓ ఫైటర్‌ను. ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. ఇప్పటి నుంచి మనమందరం మంచి విషయాలపై మాత్రమే ఫోకస్ పెట్టి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నా.'అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.

Story first published: Saturday, March 16, 2024, 21:52 [IST]
Other articles published on Mar 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+