IND vs SL: ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: శ్రీలంక కెప్టెన్
కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐదు రోజుల పాటు సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 84/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంతో నిలిచింది.
ఓడినా.. గట్టి పోటీ ఇచ్చాం..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధనంజయ డి సిల్వా..ఓడినా గట్టి పోటీ ఇచ్చామని తెలిపాడు. 'రెండో రోజు ఆట నుంచి మేం గేమ్‌లో నిలిచాం. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ అంత సులువు కాదు. కానీ ఇది మ్యాచ్‌గా మారింది. గాలే వికెట్ తొలి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించింది.

గాలేలో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని అందరికి తెలిసిందే. కానీ కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ తమకు లభించిన ఆరంభఆలను పెద్ద స్కోర్లుగా మలిచి మాపై ఒత్తిడి తెచ్చారు. టాస్ గెలవకపోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపించింది. ఎందుకంటే భారత్ టాస్ గెలిచి బోర్డుపై భారీ పరుగులు ఉంచింది. మా బ్యాటింగ్‌లో మేం త్వరగా వికెట్లు కోల్పోయి వెనుకంజలో నిలిచాం. మా తప్పిదాలను సవరించుకొని రెండో టెస్ట్‌లో పుంజుకునే ప్రయత్నం చేస్తాం.'అని ధనంజయ డిసిల్వా చెప్పుకొచ్చాడు.
శతక్కొట్టిన పడిక్కల్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
