For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6, 4, 4, 6, 6, 4.. 6 బంతుల్లో 6 బౌండరీలు(వీడియో)

చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్, బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. తనదైన షాట్లతో కేకేఆర్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. ముఖ్యంగా వైభవ్ అరోరాకు చుక్కులు చూపించాడు.

అతను వేసిన 11వ ఓవర్‌లో 6 బంతులకు 6 బౌండరీలు బాది 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో బేబీ ఏబీ వరుసగా 6, 4, 4, 6, 6, 4 మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. అతని ధాటికి వైభవ్ అరోరా ముఖం మాడిపోయింది. ప్రస్తుతం అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బేబీ ఏబీడీ తన సత్తా ఏంటో చూపించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Dewald Brevis smashed 6 ball 6 boundaries against Vaibhav Arora during KKR vs CSK Match in IPL 2025

డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అజింక్యా రహానే(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఆండ్రీ రస్సెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), మనీష్ పాండే(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 36 నాటౌట్) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(4/31) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసి గెలుపొందింది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. అరంగేట్ర ప్లేయర్ ఉర్విల్ పటేల్(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 31), శివమ్ దూబే(40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(3/48) మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది.

Story first published: Wednesday, May 7, 2025, 22:42 [IST]
Other articles published on May 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+