Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20: చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్.. ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలికిన జూనియర్ ఏబీడీ!

సౌతాఫ్రికా యువ క్రికెటర్, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 ఫ్రాంచైజీ లీగ్ SA20 వేలంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలికాడు. అప్‌కమింగ్ సీజన్ కోసం మంగళవారం నిర్వహించిన వేలంలో డెవాల్డ్ బ్రెవిస్‌ రూ. 8.3 కోట్ల ధర పలికాడు. అతన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా20 లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. అతని తర్వాత ఎయిడెన్ మార్క్‌రమ్ నిలిచాడు. అతన్ని రూ. 7 కోట్లకు డర్బన్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.

రెండేళ్ల క్రితం 2023లో ఈ SA20 లీగ్ ప్రారంభమైంది. తొలి రెండు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ గెలిచింది. మూడో సీజన్‌లోనూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ కేప్‌టౌన్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో హ్యాట్రిక్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకుంది. అయితే ఈ మూడు సీజన్లలో సన్‌రైజర్స్ జట్టును ఎయిడెన్ మార్క్‌రమ్ నడిపించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ సారి అతను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును వదిలేసాడు. దాంతో అతన్ని లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఆ కాసేపటికే డెవాల్డ్ బ్రెవిస్ అతని రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 22 ఏళ్ల వయసులోనే బ్రెవిస్ భారీ ధర పలకడం విశేషం.

Dewald Brevis Becomes Most Expensive Player in SA20 History Fetches Record 8 3 Crore in Auction

2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి 455 పరుగులు చేశాడు. గత సీజన్‌లో రిప్లేస్‌మెంట్ ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు పొందిన బ్రెవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. టీ20లతో కెరీర్ ప్రారంభించిన బ్రెవిస్.. ఈ ఏడాది వన్డేతో పాటు టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20లు ఆడి 318 పరుగులు, 6 వన్డేల్లో 110, రెండు టెస్ట్‌ల్లో 84 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, September 9, 2025, 21:08 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+