Eng vs NZ: సెంచరీతో దుమ్మురేపిన కివీస్ ఓపెనర్.. దాదా 25 ఏళ్ల రికార్డు బ్రేక్!

లండన్: అరంగేట్ర టెస్ట్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే(240 బంతుల్లో 16 ఫోర్లతో 136 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును కాన్వే అధిగమించాడు.ఓవరాల్‌గా లార్డ్స్ వేదికగా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 6వ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కాన్వే.. ఈ జాబితాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన గంగూలీ(131)ని వెనక్కునెట్టాడు.

దాదా రికార్డు బ్రేక్..
1999లో లార్డ్స్ వేదికగా టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గంగూలీ(301 బంతుల్లో 20 ఫోర్లతో 131) ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ ఘనతను అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని కన్నా ముందు హ్యారీ గ్రహమ్(107), జాన్ హాంప్ షైర్(107) లార్డ్స్‌లో అరంగేట్ర సెంచరీ అందుకోగా.. ఆ తర్వాత ఆండ్రూ స్ట్రాస్(112), మ్యాట్ ప్రియర్( 126) ఈ ఫీట్ సాధించారు. అయినా ఎవరూ దాదా స్కోర్‌ను అధిగమించలేకపోయారు. కానీ తాజాగా కాన్వే సూపర్ బ్యాటింగ్‌తో 136 పరుగులతో అజేయంగా నిలిచి గంగూలీని వెనక్కునెట్టాడు. అయితే కాన్వే, గంగూలీ ఇద్దరి బర్త్‌డే జూలై 8నే కావడం విషేషం.

లార్డ్స్‌లో అరంగేట్ర సెంచరీ వీరులు..
హ్యారీ గ్రహమ్ 107 ఆస్ట్రేలియా- ఇంగ్లండ్, 1893
జాన్ హాంప్ షైర్ 107 ఇంగ్లండ్ vs వెస్టిండీస్, 1969
సౌరవ్ గంగూలీ 131 భారత్ vs ఇంగ్లండ్ 1996
ఆండ్రూ స్ట్రాస్ 112 ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ 2004
మ్యాట్ ప్రియర్ 126 ఇంగ్లండ్ vs వెస్టిండీస్ 2007
డేవన్ కాన్వే న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ 2021

న్యూజిలాండ్ 246/3
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెవాన్ కాన్వే (136 బ్యాటింగ్) సెంచరీతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పై చేయి సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 246/3 స్కోర్ చేసింది. క్రీజులో ఓపెనర్ కాన్వేతో పాటు హెన్రీ నికోల్స్(46 బ్యాటింగ్) ఉన్నారు.

కేన్, టేలర్ ఔటైనా..
ఓపెనర్ లాథమ్ (23)తో మొదటి వికెట్‌కు 58 పరుగులతో శుభారంభం అందించిన కాన్వే... సీనియర్లు కెప్టెన్ విలియమ్సన్ (13), రాస్ టేలర్ (14) త్వరగా ఔటైనా మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. హెన్రీ నికోలస్ (46 బ్యాటింగ్)తో కలిసి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 132 పరుగులు జోడించి జట్టు పరిస్థితి చక్కదిద్దారు. ఇంగ్లండ్ బౌలర్లలో కూడా అరంగేట్ర పేసర్ ఓలీ రాబిన్సన్(2/50) రెండు వికెట్లతో సత్తాచాటగా.. జేమ్స్ అండర్సన్(1/55) ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications