For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Devon Conwayకి 'ఐసీసీ ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్' అవార్డు.. భారత మహిళా క్రికెటర్లకి నిరాశే!!

Devon Conway and Sophie Ecclestone wins ICC Players Of The Month awards For June

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూన్ నెల‌కు గాను పురుష, మహిళా క్రికెట్‌లో 'ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్‌' అవార్డులను ప్ర‌క‌టించింది. పురుషల క్రికెట్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓపెన‌ర్ డెవాన్‌ కాన్వేకు ఐసీసీ ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఇక మహిళా క్రికెట్‌లో ఇద్ద‌రు భారత ప్లేయ‌ర్స్ షెఫాలీ వ‌ర్మ‌, స్నేహ్ రాణా రేసులో ఉన్నా కూడా.. వాళ్ల‌ను వెన‌క్కి నెట్టి ఇంగ్లండ్ స్పిన్న‌ర్ సోఫీ ఎకిల్‌స్టోన్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచింది. ఈ అవార్డు అందుకోబోతున్న రెండో ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్‌గా ఎకిల్‌స్టోన్ నిలిచింది.

కాన్వేకి ఐసీసీ అవార్డు

కాన్వేకి ఐసీసీ అవార్డు

ఇంగ్లండ్‌తో జూన్‌లో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన డెవాన్‌ కాన్వే.. అరంగేట్ర టెస్టులోనే డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ దేవాన్ కాన్వే హాఫ్ సెంచరీ చేశాడు. నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కఠిన పరిస్థితుల్లో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో జూన్ నెలకి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అతడిని వరించింది.

డబుల్ సెంచరీ బాదడంతో

డబుల్ సెంచరీ బాదడంతో

డెవాన్‌ కాన్వే పాటు జూన్ నెల‌ నామినేషన్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్, దక్షిణాఫ్రికా వికెట్​కీపర్ కమ్ కెప్టెన్​ క్వింటాన్​ డికాక్ నిలిచారు. అయితే లార్డ్స్‌లో అరంగేట్ర టెస్టులో బలమైన ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్‌ని ఎదుర్కొని డబుల్ సెంచరీ సాధించిన కాన్వేకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. టెస్టు క్రికెట్‌లో నా ప్రదర్శనని ఈ అవార్డుతో మరింత ప్రత్యేకంగా మార్చింది. లార్డ్స్‌లో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ బాగా ఆడటం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని చేస్తాననే నమ్మకం ఉంది' అని కాన్వే ధీమా వ్యక్తం చేశాడు.

Peter Handscomb: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి కరోనా.. ఆందోళనలో ప్లేయర్స్!!

షెఫాలీ, రాణాకు షాకే

షెఫాలీ, రాణాకు షాకే

మహిళా క్రికెట్‌లో జూన్ నెలకి సంబంధించి నామినేషన్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్, భారత క్రికెటర్లు షెఫాలీ వర్మ, స్నేహ రాణా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టుతో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన భారత యువ సంచలనం షెఫాలీ వర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. స్నేహ రాణా అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ మెరిసి భారత్ జట్టుని ఓటమి నుంచి రక్షించింది. అయితే చివరికి అవార్డు మాత్రం సోఫీనే వరించింది. భారత్​తో టెస్టులో ఆమె 8 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

ఆన్-ఫీల్డ్ పనితీరు ఆధారంగా

ఆన్-ఫీల్డ్ పనితీరు ఆధారంగా

మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

Story first published: Monday, July 12, 2021, 15:45 [IST]
Other articles published on Jul 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+