Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: దేవదత్ పడిక్కల్ శతకం.. తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా మొదలెట్టింది. గాలే వేదికగా శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో అద్వితీయమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం చెలాయించింది. దేవదత్ పడిక్కల్(178 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 131 బ్యాటింగ్) అజేయ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగుల భారీ స్కోర్ చేసింది.

శ్రీలంక ఆటగాడి నెత్తి పగలగొట్టిన కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

శ్రీలంక ఆటగాడి నెత్తి పగలగొట్టిన కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

దేవదత్ పడిక్కల్‌తో పాటు రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్( 162 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 77 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఒక వికెట్ తీసాడు. వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు 77 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.

Devdutt Padikkal Stars With Century as KL Rahul Hits Fifty India Dominate Sri Lanka on Day 1 in 1st Test

పాపం జైస్వాల్..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్(32) దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. శ్రీలంక అరంగేట్ర స్పిన్నర్ కేశర నువంత తప్పిదంతో జైస్వాల్ బలయ్యాడు.

కేఎల్ రాహుల్ ఆడిన బంతిని అడ్డుకోవడానికి కేశర డైవ్ చేయగా.. సింగిల్‌కు ప్రయత్నించిన జైస్వాల్ అతన్ని తాకి కిందపడిపోయాడు. అప్పటికే కేఎల్ రాహుల్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు రాగా.. జైస్వాల్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. దాంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో టీమిండియా 27 ఓవర్లలో 101/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రాహుల్, పడిక్కల్ ఆధిపత్యం..

ఇదే సమయంలో వర్షం రావడంతో గంటన్నర తర్వాత రెండో సెషన్ మొదలైంది. రాహుల్, పడిక్కల్ తమ జోరును కొనసాగించారు. తమకే సాధ్యమైన షాట్లతో శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. రాహుల్ కాస్త నిదానంగా ఆడినా.. పడిక్కల్ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో టీమిండియా 197/1 స్కోర్‌తో టీ బ్రేక్ వెళ్లింది.

IND vs SL: సెంచరీ ముంగిట మైదానం వీడిన కేఎల్ రాహుల్.. ఎందుకంటే?

Also Read

IND vs SL: సెంచరీ ముంగిట మైదానం వీడిన కేఎల్ రాహుల్.. ఎందుకంటే?

పడిక్కల్ సెంచరీ..

ఆఖరి సెషన్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. చేతి, కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. క్రీజులోకి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాగా.. కేశర నువంత బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి పడిక్కల్ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. తన మూడో టెస్ట్‌లోనూ ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్(16) నిరాశపర్చాడు. ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి పంత్ రాగా.. వర్షం అంతరాయం కలిగించింది. కాసేపటి తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగా.. పంత్(27 బ్యాటింగ్), పడిక్కల్ దూకుడుగా ఆడారు. అజేయంగా 52 పరుగులు జోడించి తొలి రోజు ఆటను ముగించారు.

Story first published: Saturday, August 15, 2026, 18:21 [IST]
Other articles published on Aug 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+