ధావన్‌ను పక్కనపెట్టి.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఆడించాలి: మాజీ సెలెక్టర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో శిఖర్ ధావన్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా పరిగణించాలని, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్‌ను ఆడించాలని టీమిండియా మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా శిఖర్ ధావన్‌ను సెలెక్టర్లు రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని తెలిపాడు. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ప్రపంచకప్ నుంచి..
'ఇంగ్లండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్‌కు గాయాల బెడద పట్టుకుంది. తరచూ అతను గాయపడుతున్నాడు. మోకాలికి చికిత్స చేయించుకున్నాడు. బ్యాటింగ్‌లో మునుపటి దూకుడు తగ్గింది. ఆస్ట్రేలియా సిరీసులోనూ అతను వేగంగా పరుగులు చేయలేకపోయాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలోనూ నామమాత్రపు పరుగులతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు రాహుల్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించినా విజయవంతం అవుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.'అని దేవాంగ్ గుర్తు చేశాడు.

అలా అయితేనే శిఖర్ ధావన్..
'టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ కేఎల్ రాహుల్, రోహిత్‌శర్మ టీమిండియా తొలి ప్రాధాన్య ఓపెనర్లు. శిఖర్ ధావన్ రిజర్వు ఓపెనర్‌గా ఉంటాడు. తనవంతు వచ్చేదాకా అతను ఎదురు చూడక తప్పదు. బహుశా వన్డేల్లో అతనికి చోటు దక్కొచ్చు. అదీ కూడా టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతగా భావిస్తేనే' అని దేవాంగ్ గాంధీ స్పష్టం చేశారు. తొలిసారి టీమిండియాకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ పైన ఆయన ప్రశంసలు జల్లు కురిపించారు.

ఐదులో సూర్య..
'ముంబై ఇండియన్స్ విజయవంతం అవ్వడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఒక ప్రత్యేకమైన స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆడిస్తే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిది. వన్డే సిరీసులోనూ అనికి చోటివ్వాలి' అని అని గాంధీ భారత సెలెక్టర్లకు సూచించారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో సూర్య కుమార్ యాదవ్‌కు ఐదో స్థానం ఇవ్వాలన్నారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో పంపించాలని సలహా ఇచ్చారు.

ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి ప్లేయర్లు
ఈ సిరీస్‌లో ఫైనల్ ఎలెవన్ సెలెక్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇది మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. తొలుత సెటిల్ కాంబినేషన్‌తో వెళ్లి సిరీస్ నెగ్గిన తర్వాత ప్రయోగాలు చేస్తారా? లేదా దూరదృష్టితో ఆలోచించి మొత్తం యంగ్‌స్టర్స్‌ను దించి వారి సత్తాను పరీక్షిస్తారా? అన్నది చూడాలి. జట్టులో ఉన్న పోటీ కారణంగా సూర్యకు అవకాశం దొరకడం కష్టాంగానే కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications