బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా.. ఆయన ఎవరు అంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం ఆయనొక్కడే ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ సెక్రటరీ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. అప్పుటి నుంచి దేవజిత్ సైకియా బీసీసీఐ తాత్కలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు ప్రభ్‌తేజ్ భాటియా ట్రెజరర్ పదవికి నామినేషన్ వేశారు. బీసీసీఐలోని ఖాళీ పదవుల కోసం నిర్వహించే ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. సెక్రటరీ, ట్రెజరరీ పదవుల కోసం సైకియా, ప్రభ్‌తేజ్ మాత్రమే నామినేషన్ వేయడంతో వీరే ఈ పదవులు చేపట్టనున్నారు.

ఎవరీ దేవజిత్ సైకియా..?
దేవజిత్ సైకియా భారత ప్రముఖ న్యాయవాది. 2021 మే నుంచి అస్సాం అడ్వాకేట్ జనరల్‌గా కొనసాగుతున్నారు. అక్టోబర్ 2022 నుంచి బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అస్సాం తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.
ఆ జట్టు వికెట్ కీపర్‌గా కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. 1990-91 మధ్య నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు. సకియా అస్సామ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా బీసీసీఐ సెక్రటరీ పదవికి నామినేషన్ ధాఖలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications