Deodhar Trophy: పాపం మయాంక్ అగర్వాల్.. చేజారిన శతకం! సౌత్ జోన్ ఘన విజయం!
పుదుచ్చేరి: దేవదర్ ట్రోఫీలో సౌత్ జోన్ తన జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(115 బంతుల్లో 9 ఫోర్లతో 98) తృటిలో శతకం చేజార్చుకోగా.. బౌలింగ్‌లో సాయి కిషోర్(3/44) తీన్మార్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు కుప్పకూలింది. మయాంక్ అగర్వాల్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. అరుణ్ కార్తీక్(23), విజయ్ కుమార్ వైశాఖ్(20) మయాంక్ అగర్వాల్ తర్వాత టాప్ స్కోరర్లుగా నిలిచారు.

దేవదత్ పడిక్కల్(2), వాషింగ్టన్ సుందర్(7), నారయణ జగదీషన్(6) దారుణంగా విఫలమయ్యారు. వెస్ట్‌జోన్ బౌలర్లలో షామ్స్ ములాని(2/42), రాజవర్దనే హంగార్గేకర్(2/47) రెండేసి వికెట్లు తీయగా.. పార్త్ బట్(3/25) మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్ట్ జోన్ 36.2 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్(42), అతిత్ షేత్(40) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. విద్వత్ కావేరప్ప, వాసుకి కౌశిక్, విజయ్ కుమార్ వైశాఖ్‌కు తలో వికెట్ తీసారు.
రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన సౌత్ జోన్ 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వెస్ట్ జోన్ ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ టోర్నీలో సౌత్, వెస్ట్ జోన్‌లతో పాటు ఈస్ట్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్ టీమ్స్ తలపడుతున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications