Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Deodhar Trophy: రియాన్ పరాగ్ పోరాటం వృథా.. సౌత్‌జోన్‌దే టైటిల్!

పాండిచ్చేరి: దేశవాళీ క్రికెట్‌లో సౌత్ జోన్ దుమ్మురేపుతోంది. వరుస టైటిళ్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సీజన్ దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సౌత్ జోన్.. తాజాగా దేవదర్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. గురువారం వెస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్‌ కన్నుమ్మల్‌ (75 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 107) మెరుపు సెంచరీ చెలరేగగా.. మయాంక్‌ అగర్వాల్‌ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Deodhar Trophy: Kunnummal ton overshadows Riyan Parags 95 as South Zone lift 9th tittle

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 181 పరుగులు జత చేసి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే రోహన్‌ శతకాన్ని అందుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔట్‌ కావడంతో సౌత్‌ తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది.

కానీ నారయణ్ జగదీశన్‌ (54).. రోహిత్‌రాయుడు (26), సాయికిశోర్‌ (24) సాయంతో స్కోరు 300 దాటించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283కే ఆలౌటైంది. సౌత్ జోన్ బౌలర్లు విజయ్‌కుమార్‌ (2/59), విద్వత్‌ (2/61), కౌశిక్‌ (2/49) సత్తా చాటారు. దేవధర్‌ ట్రోఫీ గెలవడం సౌత్‌కిది తొమ్మిదోసారి.

లక్ష్య ఛేదనలో సౌత్‌ జోన్ బౌలర్ల ధాటికి ఈస్ట్‌ జోన్ 115/5తో ఓటమి దిశగా సాగింది. కానీ రియాన్‌ పరాగ్‌ (65 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95).. కుశాగ్ర (68)తో కలిసి జట్టులో ఆశలు రేపాడు. సెంచరీ ముంగిట పరాగ్‌ను ఔట్‌ చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ (3/60) ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కుశాగ్ర కూడా వెనుదిరగడంతో ఈస్ట్‌ జోన్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Friday, August 4, 2023, 11:09 [IST]
Other articles published on Aug 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+