Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Delhi Capitals: అశ్విన్‌ మరో యాంగిల్.. ఈసారి లెప్ట్ హ్యాండ్ బౌలింగ్!

Delhi Capitals spinner Ravichandran Ashwin bowls from left hand in nets ahead Of IPL 2020

దుబాయ్: గత రెండు సీజన్లలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ను‌.. డిసెంబర్‌ 2019లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. దీంతో అశ్విన్‌ ఈసారి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభం కాకముందే అశ్విన్ పేరు వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని మాన్కడింగ్ చేయడమే. తాజాగా మరో ఘటనతో అశ్విన్‌ వార్తల్లో నిలిచాడు.

 మోసం చేయడం ఓ కళ:

మోసం చేయడం ఓ కళ:

లెప్ట్ హ్యాండ్ ప్రాక్టీస్‌ వీడియోను ఆర్ అశ్విన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'మనం చేసేది తప్పా లేక ఒప్పా అన్నది కేవలం అవగాహన మాత్రమే.. అందుకే బౌలింగ్‌తో ఎదుటివారిని ముప్పతిప్పలు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మోసం చేయడం అనేది ఒక కళ.. అది అందరికి అబ్బదు' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అశ్విన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 139 మ్యాచ్‌లాడి.. 125 వికెట్లు తీశాడు. ఎక్కువకాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

 టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని:

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని:

మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ రాకతో భారత వన్డే, టీ20 జట్టుకి గత మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్న ఆర్ అశ్విన్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అశ్విన్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 71 టెస్టుల్లో, 11 వన్డేల్లో, 46 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 365, వన్డేల్లో 150, టీ20ల్లో 52 వికెట్లు తీసాడు.

పంజాబ్‌తో తొలి మ్యాచ్‌:

పంజాబ్‌తో తొలి మ్యాచ్‌:

ఇంతవరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది. 2019లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారధ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన ఢిల్లీ.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈసారి ఢిల్లీ జట్టుకు అధనంగా ఆర్ అశ్విన్‌, అజింక్య రహానే, మార్కస్‌ స్టోయినిస్‌ లాంటి ఆటగాళ్లు చేరడం మరింత బలం చేకూర్చింది. సెప్టెంబర్‌ 20న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. నవంబర్‌ 2న జరిగే లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.

బౌలర్లు తస్మాత్ జాగ్రత్త.. ఐపీఎల్‌కి ఓ రేంజ్‌లో సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ (వీడియో)

Story first published: Saturday, September 12, 2020, 15:26 [IST]
Other articles published on Sep 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+