Delhi Capitals Playing 11: స్టీవ్ స్మిత్‌కు మళ్లీ నిరాశే.. రాజస్థాన్‌తో బరిలోకి దిగే ఢిల్లీ జట్టు ఇదే!

దుబాయ్: భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్.. సెకండాఫ్‌లోనూ అదరగొట్టింది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభాన్ని అందుకుంది. ఈ విజయ ఉత్సాహంలోనే మరో ఆసక్తికరపోరుకు సిద్దమవుతోంది. డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఒక్క మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతోంది. గతేడాది ఇదే యూఏఈ గడ్డపై ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఢిల్లీ ఈ సారి లెక్క సరిచేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటుంది.
మరోవైపు ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన రాజస్థాన్ రాయల్స్ నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత కొత్తగా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు లేకున్నా యువ ఆటగాళ్లతో కూడిన సంజూ శాంసన్ సేన.. పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయాన్నందుకుంది. ఆఖరి ఓవర్లో దక్కిన గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇదే జోరులో ఢిల్లీని ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటుంది. రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగే ఢిల్లీ తుది జట్టుపై ఓ లుక్కెద్దాం. హైదరాబాద్‌తో బరిలోకి దిగినే జట్టునే కొనసాగించవచ్చు.

ఓపెనర్లుగా శిఖర్, పృథ్వీషా..
ఇక ఢిల్లీ ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీషా బరిలోకి దిగనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఫస్టాఫ్‌లో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచే మొదలుపెట్టాడు. 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో కలిపి 42 రన్స్ చేశాడు. దాంతో ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 400కు పైగా పరుగులు చేయడం ధావన్‌కు ఇది ఎనిమిదో సారి. మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఈ యువ హిట్టర్‌ను తక్కువ అంచనా వేయలేం.

అయ్యర్, హెట్‌మైర్, పంత్
మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, షిమ్రన్ హెట్‌మైర్, రిషభ్ పంత్ ఆడనున్నారు. దాంతో ఈ మ్యాచ్‌కు కూడా స్టీవ్ స్మిత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. గాయంతో కోలుకున్న తర్వాత ఫస్ట్ మ్యాచ్‌లోనే అయ్యర్ అద్భుతంగా ఆడాడు. ధావన్ ఔటైన తర్వాత రిషభ్ పంత్(35 నాటౌట్)తో కలిసి అయ్యర్(47 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. ఢిల్లీ సక్సెస్ సీక్రెట్ మిడిలార్డర్ పటిష్టంగా ఉండటమే. ఈ ఇద్దరు మరోసారి చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. ఇక బంతిని బలంగా బాదగల సామర్థ్యం ఉన్న హెట్‌మైర్ జట్టుకు అదనపు బలం. స్మిత్‌ను ఆడించాలనుకుంటే మాత్రం హెట్‌మైర్ ఉద్వాసనకు గురవుతాడు.

మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్
ఆల్‌రౌండర్ల కోటాలో మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్ జట్టులో కొనసాగనున్నారు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ బౌలింగ్‌లో సత్తా చాటాడు. కీలక కేన్ విలియమ్సన్ వికెట్‌తో పాటు జాసన్ హోల్డర్‌ను ఔట్ చేశాడు. ఇక లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్ పటేల్‌కు ఉంది. అలాగే తన స్పిన్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగలడు. ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఢిల్లీకి ఏ బాధ ఉండదు.

ఆ నలుగురు..
బౌలర్లుగా కగిసోరబడా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ జట్టులో కొనసాగనున్నారు. అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్‌లతో కగిసో రబడా పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. రవిచంద్రన్ అశ్విన్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నోర్జ్ రెండు కీలక వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్, కేదార్ జాదవ్‌లను పెవిలియన్ చేర్చాడు. ఇక రబడా మూడు వికెట్లతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. అశ్విన్, అవేశ్ ఖాన్ వికెట్లు తీయకపోయినా తమదైన రోజున ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, షిమ్రన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications