LSG vs DC: ఇక్కడ డేవిడ్ వార్నర్, అన్రిచ్ నోర్జ్.. అక్కడ మార్కస్ స్టోయినిస్.. బరిలోకి దిగే తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దుమ్మురేపుతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ రోజు (గురువారం) రాత్రి 7.30 గంటలకు డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
లక్నో మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. రెండింటిలో ఒకటి గెలిచిన ఢిల్లీ గెలుపు కోసం పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నోపై అద్భుత విజయాన్నందుకోగా.. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓటమిపాలైంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి రావడంతో తుది జట్లలో మార్పులు తప్పేలా లేవు.

వార్నర్, నోర్జ్ ఎంట్రీ..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ అందుబాటులోకి వచ్చారు. ఇప్పటికే వార్నర్ క్వారంటైన్ పూర్తి చేసుకోగా.. నోర్జ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆడటం ఖాయం. డేవిడ్ వార్నర్ రాకతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్‌పై వేటు పడనుంది. పృథ్వీషాతో కలిసి వార్నర్ ఓపెనింగ్ చేయనున్నాడు. చాలా రోజుల తర్వాత వార్నర్ మళ్లీ ఢిల్లీకి ఆడుతుండటం ఆసక్తిగా మారింది. ఇన్నాళ్లు ముగ్గురు ఓవర్‌సీస్ ప్లేయర్లతో ఆడిన ఢిల్లీ.. అన్రిచ్ నోర్జ్ రాకతో పూర్తిస్థాయి కోటాతో ఆడనుంది.

కేఎస్ భరత్‌కు చాన్స్..
నోర్జ్ రాకతో ఖలీల్ అహ్మద్‌పై వేటు పడనుంది. నంబర్‌లో వరుసగా విఫలమైన మన్‌దీప్ సింగ్ స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు చోటు దక్కనుంది. అతనితో పాటు సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్ కూడా పోటీలో ఉన్నారు. లలిత్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ బరిలోకి దిగడం ఖాయం. ఈ లైనప్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

మార్కస్ స్టోయినిస్ ఎంట్రీ..
లక్నో సూపర్ జెయింట్స్‌లోకి మార్కస్ స్టోయినిస్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతేడాది వరకు ఢిల్లీకే ఆడిన అతను.. ఆ జట్టుతోనే ఈ సీజన్ ప్రారంభించనుండటం విశేషం. స్టోయినిస్ రాకతో ఆండ్రూ టై బెంచ్‌కే పరిమితం కానున్నాడు. స్టోయినిస్‌తో పాటు డికాక్, లూయిస్, జాసన్ హోల్డర్ ఓవర్‌సీస్ కోటాలో ఆడనున్నారు. లక్నోలో ఆయుష్ బదోని, దీపక్ హుడా, జాసన్ హోల్డర్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. డికాక్, లూయిస్ సైతం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.


తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, అంకిత్ రాజ్‌పూత్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్/యశ్ ధుల్/మన్‌దీప్ సింగ్/కేఎస్ భరత్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పోవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications