
తదుపరి మ్యాచ్‌లో చూసుకుంటాం..
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన పృథ్వీ షా తన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు.'లక్నో సూపర్ జెయింట్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయాం. ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించడం మాకు సానుకూలాంశం. ఈ ఓటమిని పెద్దగా పట్టించుకోం. తదపరి మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం. మేం ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించకపోయినా.. చివర వరకు పోరాడాం. ఈ మ్యాచ్‌లో మేం కొన్ని తప్పులు చేశాము. తదుపరి మ్యాచ్‌లో అవి పునరావృతం కాకుండా చూసుకుంటాం .'అని పేర్కొన్నాడు.

వార్నర్‌కు బిగ్ ఫ్యాన్..
ఇక డేవిడ్ వార్నర్ గురించి పృథ్వీ షా మాట్లాడుతూ..'వార్నర్ దాదపు పదేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్‌కు పెద్ద అభిమానిని. నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి ఒక బ్యాటర్ సిక్సర్లు, ఫోర్లు కొట్టడం చూడటం నాకు చాలా ఇష్టం. లక్నో మ్యాచ్‌లో వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది.'అని పృథ్వీ షా చెప్పాడు.

67లో 61 పృథ్వీషావే..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ పృథ్వీషా ధనాధన్ ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించాడు. ఓ వైపు డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతున్నా.. మరోవైపు షా చెలరేగాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీషా.. కృష్ణప్ప గౌతమ్ వేసిన 8వ ఓవర్‌లో వరుసగా రెండు బంతులను 6, 4 గా కొట్టి తదుపరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో 67 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే 67 పరుగుల్లో పృథ్వీషావే 61 కావడం విశేషం. డేవిడ్ వార్నర్ 4 పరుగులు చేయగా.. 2 ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

డికాక్ సూపర్ ఇన్నింగ్స్..
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 10న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications












