For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబ్బుల కోసమే రిషభ్ పంత్ ఢిల్లీని వదిలేసాడు: హెడ్ కోచ్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ తెలిపాడు. డబ్బుల కోసమే పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వెళ్లాడని చెప్పాడు. తన మార్కెట్ ప్రైజ్ తెలుసుకునేందుకు పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్‌కు ఒప్పుకోలేదని తెలిపాడు. ఎంత కన్విన్స్ చేసినా తమ మాట వినలేదన్నాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఓ యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన హేమాంగ్ బదానీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Delhi Capitals Head Coach Hemang Badani Says Rishabh Pant Left DC For More Money ahead of IPL 2025

మార్కెట్ ప్రైజ్ తెలుసుకునేందుకు..
'మేం ఒకటి అనుకుంటే.. రిషభ్ పంత్ మరొకటి ఆలోచించాడు. అతను వేలంలో వెళ్లాలనుకున్నాడు. తాను ఎంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా.. అతని ఢిల్లీ రిటెన్షన్‌కు ఒప్పుకోలేదు. సపోర్ట్ స్టాఫ్‌తో మేనేజ్‌మెంట్ అతన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చాలా సార్లు ఫోన్లు మాట్లాడటంతో పాటు మేసేజ్‌లు పంపించారు. పంత్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

పంత్‌ను రిటైన్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది. కానీ పంత్ మాత్రం వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రిటెన్షన్ హయ్యెస్ట్ క్యాప్‌డ్ సాలరీ రూ. 18 కోట్ల కంటే ఎక్కువ పలుకుతానని భావించాడు. అతను అనుకున్నట్లుగానే భారీ ధర పలికాడు. రూ. 27 కోట్ల రికార్ధ ధరను సొంతం చేసుకున్నాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది.'అని హేమాంగ్ బదానీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిషభ్ పంత్ కూడా ట్విటర్ వేదికగా.. తాను ఎంత ధర పలకుతానని నెటిజన్లు ప్రశ్నించాడు.

ఢిల్లీ మేనేజ్‌మెంట్‌తో పడక..
అయితే తన కెప్టెన్సీపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌కు బాగా హర్ట్ అయిన పంత్.. ఎమోషనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాత్ తెలిపిన విషయం తెలిసిందే. తమ ఫీడ్ బ్యాక్‌ను పంత్ అపార్థం చేసుకున్నాడని తెలిపాడు. పంత్‌‌ను వదులుకోవడానికి తమకు మనసొప్పలేదని, చివరకు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కూడా తీసుకునేందుకు ప్రయత్నించామన్నాడు. రూ. 27 కోట్ల ధర ఎక్కువవడంతో వదిలేసామని చెప్పాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్ కోసం తీవ్రంగా పోటీ పడిన లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20.75 కోట్లకు దక్కించుకుంది. కానీ అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించుకుంది. దాంతో లక్నో రూ. 27 కోట్లకు బిడ్ వేయగా.. ఢిల్లీ తప్పుకుంది. ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన పంత్.. ఐపీఎల్ 2021లో ఆ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు ఆ జట్టు టైటిల్ గెలవలేదు.

Story first published: Sunday, December 8, 2024, 9:46 [IST]
Other articles published on Dec 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+