Delhi Capitals: పంత్ సేనకు గట్టిషాక్.. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!

న్యూఢిల్లీ: కరోనాతో అర్దంతరంగా వాయిదాపడిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమయాత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేదికలను ఖారారు చేసిన బోర్డు.. షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. స్టెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ లీగ్‌కు ఉన్న అడ్డంకులన్నిటిన మాస్టర్ ప్లాన్‌తో అధిగమించింది. అయితే ఈ సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. టెన్నిస్ ఎల్బో గాయంతో అతను బాధపడుతుండటమే దీనికి కారణం.

అప్పుడే ఇబ్బంది పడ్డా..
తాజాగా 'క్రికెట్.కామ్ ఏయూ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయం నయమవ్వకుంటే టీ20 ప్రపంచకప్ కూడా ఆడనని తెలిపాడు. యాషెస్ సిరీస్‌కు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. గత సీజన్ మాదిరి యాషెస్ సిరీస్‌లో రాణించాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2021 సమయంలో తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, పెయిన్ కిల్లర్స్ వేసుకొని బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. 'ఐపీఎల్ సమయంలో నేను 100 శాతం ఫిట్‌గా లేను. దాంతో బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ఫిజియోల సాయంతో పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్‌ఫ్లేమటరీస్ తీసుకున్నాను.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

నాకు టెస్ట్ క్రికెటే ఎక్కువ.
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడం నాకు ఇష్టమే. కానీ నా దృష్టిలో టెస్ట్ క్రికెట్ అంత కంటే ఎక్కువ. ఇక నా ప్రధాన లక్ష్యం యాషెస్ సిరీస్. గత కొన్నేళ్లుగా యాషెస్ సిరీస్‌లో చేసింది పునరావృతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది.'అని స్మిత్ తెలిపాడు. గత మూడు యాషెస్ సిరీస్‌లో ఈ వరల్డ్ నెంబర్ 2 బ్యాట్స్‌మన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 93.76 సగటుతో 1969 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలున్నాయి. 'గత యాషెస్ సిరీస్‌లో చూపించిన ప్రభావాన్ని చూపగల స్థితిలో నన్ను నేను ఫిట్‌గా ఉంచాలనుకుంటున్నాను. అవసరమైతే టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరంగా ఉంటాను. అయితే మెగా టోర్నీకి చాలా సమయం ఉన్నందున ఆ అవసరం రాదనే ఆశాభావంతో ఉన్నాను'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ సెకండాఫ్ డౌట్..
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నానని తెలిపిన స్మిత్ 10 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు చెప్పాడు. యాషెస్ సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి తప్పుకున్న స్మిత్.. అవసరమైతే టీ20 ప్రపంచకప్ ఆడనంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌ల్లో పాల్గొనడం సందేహంగా మారింది. అతని మాటలను బట్టి చూస్తే ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 26 సగటు, స్ట్రైక్ రేట్ 111.83తో 104 రన్స్ మాత్రమే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications