For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Delhi Capitals 11: స్టోయినిస్ ఇన్.. టామ్ కరన్ ఔట్.. కోల్‌కతా‌తో బరిలోకి దిగే ఢిల్లీ జట్టు ఇదే!

Delhi Capitals 11 vs KKR: Tom Curran Out And Marcus stoinis in For IPL 2021 Qualifier 2

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. దాంతో నేరుగా ఫైనల్ వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన పంత్ సేన మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది. షార్జా మైదానం వేదికగా బుధవారం జరిగే క్వాలిఫయర్2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టైటిల్ గెలవాలనే కసిలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి ఫైనల్ చేరాలనుకుంటుంది. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దీంతో రేపటి నాకౌట్ సమరం హోరాహోరీగా సాగనుంది. చెన్నైతో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే పనిలోపడిన ఢిల్లీ.. బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలనుకుంటుంది. ఇక ఈ మెగా పోరులో బరిలోకి దిగే ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా..

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా..

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీషా బరిలోకి దిగనున్నాడు. గత మ్యాచ్‌లో పృథ్వీషా హాఫ్ సెంచరీతో దుమ్మురేపగా శిఖర్ ధావన్ తీవ్ర నిరాశపరిచాడు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో శిఖర్ అద్భుతంగా రాణించాడు. ఇప్పటికే 500 ప్లస్ పరుగులు నమోదు చేశాడు. మరోవైపు పృథ్వీషా సైతం మంచి టచ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ‌తో మ్యాచ్‌లో 48 పరుగులు చేసిన షా.. చెన్నైపై 60 రన్స్ బాదాడు. సెకండాఫ్‌ ఆరంభంలో కొంత తడబడిన పృథ్వీ.. ఆర్‌సీబీ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చక్కులు చూపిస్తున్నారు. ఈ ఇద్దరు కేకేఆర్‌పై చెలరేగితే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. పైగా మెగా లీగ్‌లో వీరికి మంచి సమన్వయంతో పాటు రికార్డు ఉంది.

అయ్యర్, పంత్, హెట్‌మైర్..

అయ్యర్, పంత్, హెట్‌మైర్..

శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హెట్‌మైర్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో అయ్యర్ విఫలమైనప్పటికీ.. నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 145 రన్స్ చేశాడు. ఇక హెట్‌మైర్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. జట్టుక కావాల్సిన 20, 30 కీలక పరుగులు జోడిస్తున్నాడు. ఇక సీఎస్‌కేపై అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన రిషభ్ పంత్ ఫామ్ అందుకున్నాడు. కేకేఆర్‌పై విజయం సాధించి ఢిల్లీ ఫైనల్ చేరాలంటే ఈ ముగ్గురు రాణించాల్సిందే.

టామ్ కరన్ ఔట్..

టామ్ కరన్ ఔట్..

ఇక గత మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటినప్పటికీ.. కీలక ఆఖరి ఓవర్‌లో తడబడిన టామ్ కరన్‌పై వేటు పడనుంది. మార్కస్ స్టోయినిస్ ఫిట్ అయితే అతను జట్టులోకి రానున్నాడు. లేకుంటే యువ ఆటగాడైన జయంత్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. షార్జా పిచ్ స్పిన్‌కు అనుకూలమైన నేపథ్యంలో జయంత్ యాదవ్‌కు అవకావం ఇవ్వచ్చు. అయితే లోయరార్డర్ బ్యాటింగ్ డెప్త్ ఉండాలని భావిస్తే మాత్రం టామ్ కరన్‌ను కొనసాగించవచ్చు. ఇక స్టోయినిస్ గాయంపై క్లారిటీ లేదు. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. కీలక సమయంలో జట్టుకు కావాల్సిన వికెట్లను తీస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

ఆ నలుగురు..

ఆ నలుగురు..

అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, అవేశ్ ఖాన్‌లతో కూడిన పేస్ త్రయానికి తోడుగా స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఈ నలుగురు మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే గత మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ దారళంగా పరుగులిచ్చినప్పటికీ కీలక వికెట్లు తీశాడు. నోర్జ్, రబడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. నెమ్మదైన షార్జా వికెట్‌పై అశ్విన్ కీలకం కానున్నాడు. అయితే అశ్విన్ ఫామ్ ఆ జట్టును కలరపెడుతుంది. 12 మ్యాచ్‌ల్లో అతను ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే బ్యాటింగ్‌లో అతను రాణిస్తున్నాడు. ముంబైపై కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసిన అన్రిచ్ నోర్జ్.. బంతికో పరుగు మాత్రమే ఇస్తున్నాడు. ఢిల్లీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ అవేశ్ ఖాన్(23) కాగా.. రబడా 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నలుగురు రాణించడం చాలా కీలకం.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా:

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా:

శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, టామ్ కరన్/స్టోయినిస్/ రబడా, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్

Story first published: Tuesday, October 12, 2021, 17:23 [IST]
Other articles published on Oct 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+