
అసలేం జరిగిందంటే..?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి బంతిని దీపక్ చాహర్ స్లాట్‌లో వేయగా.. మార్టిన్ గప్టిల్ సునాయసంగా స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. గప్టిల్ ఆ షాట్ కొట్టిన తర్వాత కనీసం బంతి వైపు కూడా చూడలేదు. దీపక్ చాహర్ వైపు సీరియస్‌గా చూస్తూ అతని ఇగోను టచ్ చేశాడు. సైలెంట్‌గా అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
ఆ మరుసటి బంతిని కూడా దీపక్ చాహర్ అదే రీతిలో వేశాడు. కానీ బంతి వేగం తగ్గించడంతో గప్టిల్ క్రీజులోకి డీప్‌గా వెళ్లి భారీ షాట్ ఆడాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కానీ బంతి గాల్లోకి లేవగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో ఎలాంటి సంబరాలు చేసుకోని దీపక్ చాహర్.. అతని వైపు చూస్తూ కన్నెర్ర చేశాడు.
గెలికి మరి తన్నించుకోవడం ఇదే..
ఈ వీడియోను చూసిన అభిమానులు గప్టిల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా దీపక్ చాహర్ ఇగో టచ్ చేసి గప్టిల్ మూల్యం చెల్లించుకున్నాడని ట్వీట్ చేస్తున్నారు. ఇక తన తప్పిదాన్ని తెలుసుకున్న గప్టిల్.. పశ్చాతాపంతో మాట మాట్లాడకుండా పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ సీరియస్ లుక్ ఇస్తున్నా అతని వైపు చూడను కూడా చూడలేదు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

చెలరేగిన సూర్య, రోహిత్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్ చాప్‌మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications












