For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Deepak Chahar: ధోనీ చెక్కిన శిల్పం! 16 ఏళ్ల వయసులో క్రికెట్‌కే పనికిరాడన్నారు!

Deepak Chahar UnKnown Facts And Impact Of MS Dhoni In His Cricket Journey

మైఖేల్ ప్రత్యేకం: 16 ఏళ్ల వయసులో క్రికెట్‌కు పనికిరావన్నారు.! గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తీ.. నీ బౌలింగ్‌లో పసలేదు.. నీకు భవిష్యత్తే లేదన్నాడు. కానీ, రెండేళ్లకే రంజీల్లోకి వచ్చేశాడు.. అంతేనా ఫస్ట్ మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక తిరుగేలేదు అనుకుంటే.. కెరీర్ రివర్సైంది. గాయాలు వెంటాడాయి. అవకాశాలు చేజారాయి. కెరీర్ అయోమయంలో పడింది. ఐపీఎల్ రూపంలో చాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినా అతను కుంగిపోలేదు. విఫలమైనప్పుడల్లా వెనక్కులాగిన విల్లులా ముందుకొచ్చాడు. నాన్న వెన్న తట్టి ప్రోత్సహించగా.. కోచ్‌గా మారి ఆటతో పాటు జీవిత పాఠాలు నేర్పించగా.. ఐపీఎల్‌లో దక్కిన మరో అవకాశంతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రాటుదేలాడు.

ఆ వెంటనే టీమిండియాలోకి దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో హ్యాట్రిక్ సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిసారించాడు. ఆ తర్వాత మళ్లీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. జట్టులో నెలకొన్న పోటీతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితయ్యాడు. ఈ పరిస్థితుల్లో లంక పర్యటనలో దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఈ సారి బౌలర్‌గా కాదు.. బ్యాట్స్‌మన్‌గా అలరించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చిరస్మరణీయ విజయాన్నందించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఓ మరుపురాని విజయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

క్రికెట్‌కు పనికిరాడన్న చాపెల్..

క్రికెట్‌కు పనికిరాడన్న చాపెల్..

స్టైలిష్ లుక్స్‌తో బాలీవుడ్ హీరోను తలపించే దీపక్ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. టీనేజ్‌లోనే అతను రిజెక్షన్‌కు గురయ్యాడు. ఏజ్ లెవెల్ క్రికెట్‌‌లో బాగా ఆడుతూ.. 16 ఏళ్ల వయసులో(2008) రాజస్థాన్ క్రికెట్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ఆ సమయంలో అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రేగ్ చాపెల్.. తన బౌలింగ్ సామర్థ్యాన్ని శంకిస్తూ.. రిజెక్ట్ చేయడంతో దీపక్ గుండె బద్దలైంది. కోచింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న చాపెల్ రిజెక్ట్ చేయడంతో చహర్‌లో నిజంగానే పసలేదని చాలా మంది అనుకున్నారు.

 దేశవాళీలో సంచలనం..

దేశవాళీలో సంచలనం..

కారీ ఈ రిజెక్షన్‌ దీపక్‌లో కసినిపెంచింది. తన ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. అందుకోసం డేనైట్ కష్టపడ్డాడు. రెండేళ్లలోనే రాజస్థాన్ రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ జట్టుపై అరంగేట్రంలోనే అద్భుత పెర్ఫామెన్స్‌తో దేశవాళీ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. 10 పరుగులకు 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. చాహర్ ధాటికి హైదరాబాద్ 21 పరుగులకే ఆలౌటైంది. ఆ సీజన్‌లో 40 ప్లస్ వికెట్లు తీయడంతో దీపక్‌ అంతా ఫ్యూచర్ ఇండియా స్టార్‌గా భావించారు. కానీ, కీలక సమయంలో గాయాలు కావడం చహర్ కెరీర్‌ను దెబ్బతీసింది.

తండ్రే గురువై..

తండ్రే గురువై..

చాపెల్ రిజెక్ట్ చేసినప్పుడు..రంజీ తొలి సీజన్ తర్వాత గాయాలతో ఆట దెబ్బతిన్నప్పుడు దీపక్ కుంగిపోలేదు. అందుకు కారణం అతని తండ్రి లోకేంద్ర సింగ్ చహర్. ఈ రెండు సందర్భాల్లోనే కాదు దీపక్ విఫలమైనప్పుడల్లా లోకేంద్ర అండగా నిలిచాడు. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అయిన లోకేంద్ర కూడా క్రికెటర్ కావాలనుకున్నా.. అతని తండ్రి ఒప్పుకోలేదు. అయితే తన కొడుకు ఆశయం కూడా అదే కావడంతో .. దీపక్‌ను ప్రాత్సహించి అతని కలతో పాటు తన ఆశయాన్ని నేరవేర్చుకోవాలనుకున్నాడు. ఆ దిశగా చిన్నప్పటి నుంచే దీపక్‌ను తీర్చిదిద్దాడు. అతని కోసం ఉద్యోగాన్ని కూడా వదిలి రాజస్థాన్ నుంచి సొంతూరు ఆగ్రాకు వచ్చి.. తనకు తెలిసి క్రికెట్ పాఠాలను నేర్పాడు.

 మాల్కమ్ మార్షల్, డేల్ స్టెయిన్ వీడియోలతో..

మాల్కమ్ మార్షల్, డేల్ స్టెయిన్ వీడియోలతో..

క్రికెట్ కోచింగ్ గురించి పెద్దగా తెలియకపోయినా.. తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ మాల్కమ్ మార్షల్, డేల్ స్టెయిన్ బౌలింగ్ వీడియోలను చూస్తూ.. దీపక్‌కు నేర్పించేవాడు. అంతేకాకుండా అతని శిక్షణ కోసం సొంత డబ్బులతో టర్ఫ్, కాంక్రీట్‌లతో కూడిన పిచ్‌లను ఏర్పాటు చేశాడు. ప్రాక్టీస్ వల్ల దీపక్ సరిగ్గా స్కూల్‌కు కూడా వెళ్లలేదు. ట్రైనింగ్, జిమ్, రెస్ట్, రికవరీ. ఇదే దీపక్ దినచర్య. అతని డిగ్రీవరకు ఇదే కొనసాగింది. తండ్రిమార్గనిర్దేశంలో నెట్స్‌లో కొన్ని లక్షల బంతులు బౌలింగ్ చేసి ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకున్న దీపక్ డొమెస్టిక్, ఐపీఎల్‌లో సత్తాచాటాడు.

2018 ఐపీఎల్ టర్నింగ్ పాయింట్..

2018 ఐపీఎల్ టర్నింగ్ పాయింట్..

దీపక్ కెరీర్‌లో 2018 ఐపీఎల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్‌లో తొలుత రాజస్థాన్‌కు ఎంపికైనా దీపక్‌కు ఆడే అవకాశం రాలేదు. 2016, 2017 సీజన్లలో పుణే సూపర్ జెయింట్స్‌కు ఆడినా మెప్పించలేకపోయాడు. 2018 ఐపీఎల్‌కు ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. పుణె తరఫున ఆడిన సమయంలోనే దీపక్‌లోని స్పార్క్‌ను చూసిన ధోనీ.. అతని బౌలింగ్‌కు మరింత మెరుగులు దిద్దాడు. కొత్తబంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే దీపక్‌తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయిస్తూ.. స్పెషలిస్ట్‌గా నిలబెట్టాడు. పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్ చేయాలో.. వైడ్ యార్కర్లు, స్లోయర్లు వేయడం అక్కడే దీపక్ నేర్చుకున్నాడు. 2018లో 10 వికెట్లతో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్..2019లో 22 వికెట్లు తీసాడు. గాయాలతో ఫామ్ కోల్పోయిన అతను 2020లో 12 వికెట్లతో విఫలమైనా.. ఈ ఏడాది 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌పై మరింత దృష్టిసారించి రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లో దీపక్‌కు చోటు దక్కడం ఖాయం!

Story first published: Thursday, July 22, 2021, 13:50 [IST]
Other articles published on Jul 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+