ప్రపంచకప్‌కు దూరం..
బంతితో పవర్ ప్లేలో ఒకటిరెండు వికెట్లు తీయడమే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటుతో సిక్సర్లు బాదుతూ పరుగులు కూడా చేయగలగడం దీపక్ చాహర్ స్పెషల్ టాలెంట్. అయితే రీఎంట్రీలో పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడని దీపక్ చాహర్ మరోసారి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన దీపక్ చాహర్ గాయం తిరగబెట్టడంతో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడలేదు. బుమ్రా తరహాలోనే వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను కూడా టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపించింది.

నడుము జాగ్రత్త అంటూ..
ఇక దీపక్ చాహర్ గాయంపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. అతని అక్క మాలతి చాహర్ చేసిన ఓ ట్వీట్‌ను మళ్లీ రీట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్ 2021లో తన గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌కి స్టేడియంలో ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్, ఈ ఏడాది జూన్ 2న ఆమెలో ఆగ్రాలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే మాలతి.. తనదైన శైలిలో సోదరుడికి వివాహ శుభాకాంక్షలు చెప్పింది. కొత్త జంటతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె..'ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు. దీపక్ హనీమూన్‌లో నీ నడుము జాగ్రత్త. అసలే మనకు ప్రపంచకప్ ఉంది'అంటూ కొంటెగా ట్వీట్ చేసింది.

మాలతి చాహర్ గాయంతో
మాలతి భయపడినట్లే వెన్ను నొప్పితో దీపక్ చాహర్ ప్రపంచకప్‌కు దూరమవడంతో ఆమె ట్వీట్ మరోసారి తెరపైకి వచ్చింది. దీపక్ చాహర్.. అక్క చెప్పినట్టు విని, ఆ నడుముకి కాస్త పని తక్కువ చెప్పి ఉంటే ఈపాటిక ఆస్ట్రేలియాలో ఉండేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'అక్క మాట ఎప్పుడూ వినాలి.. చాహర్' అంటూ ఇంకొందరూ సెటైర్లు పేల్చుతున్నారు. మాలతి చాహర్ మోడలింగ్ చేస్తూ బాలీవుడ్‌లో నటిగా రాణిస్తోంది.


Click it and Unblock the Notifications
