For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి దీపక్ చాహర్! ధర ఎంతంటే?

 Deepak Chahar To Play For SRH In IPL 2022, Check Out The Price He Will Be For Sold For

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు పకడ్బందీ ప్రణాళికలతో సిద్దమవుతున్నాయి. వేలంలో అనుసరించాల్సిన అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఏయే ప్లేయర్‌ను టార్గెట్ చేయాలి.. ఎంత వరకు పోటీపడాలనే పక్కాలెక్కలను చూసుకుంటున్నాయి. ఇక గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలని భావిస్తుంది. అనుభవం లేని ఆటగాళ్లతో మూల్యం చెల్లించుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ సారి ఆ తప్పిదం చేయకూడదనుకుంటుంది. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా వేలంలో మెరుగైన ఆటగాళ్లను ఎంచుకోవడమే లక్ష్యంగా సిద్దమవుతోంది.

దీపక్ చాహర్ కోసం..

దీపక్ చాహర్ కోసం..

గత నాలుగు, ఐదు సీజన్లుగా ఇండియా స్టార్ ఆటగాళ్లు లేక విదేశీ ప్లేయర్లపై పూర్తిగా ఆధారపడిన హైదరాబాద్.. ఈ సారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. ఫారినర్స్‌తో పాటు దేశీయ ఆటగాళ్లను తీసుకోవాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లను టార్గెట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్‌ను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రోల్‌లో దీపక్ చాహర్‌ను తీసుకోవాలనుకుంటుంది.

పేస్ విభాగాన్ని లీడ్ చేసేందుకు..

పేస్ విభాగాన్ని లీడ్ చేసేందుకు..

గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన దీపక్ చాహర్ ఆ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2018 మెగా వేలం రూ.80 లక్షలకే అతన్ని తీసుకున్న చెన్నై.. అతన్ని మేటీ పేసర్‌గా తయారు చేసింది. ముఖ్యంగా ధోనీ అతన్ని స్టార్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాడు. సూపర్ బౌలింగ్‌కు తోడు బ్యాట్‌తో కూడా సత్తా చాటుతుండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ మాదిరి దీపక్ చాహర్‌ను తమ ప్రధాన పేసర్‌గా మార్చుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

జాక్ పాట్ ధర పలికే చాన్స్...

జాక్ పాట్ ధర పలికే చాన్స్...

రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను వదిలేసింది. దాంతో రూ. 2 కోట్ల కనీస ధరతో దీపక్ చాహర్ వేలానికి అందుబాటులోకి వచ్చాడు. అయితే దీపక్ చాహర్‌ను మళ్లీ తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ సైతం చాహర్ కోసం పోటీపడనుంది. వాంఖడేలో అతనికి మంచి రికార్డు ఉన్న నేపథ్యంలో ముంబై అతనిపై కన్నేసింది. అంతేకాకుండా సౌతాఫ్రికాతో ముగిసిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో దీపక్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పది ఫ్రాంచైజీలు అతన్ని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను సులువుగా రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలికే చాన్సుంది. అయితే సన్‌రైజర్స్ దీపక్ కోసం రూ.10 కోట్లు చెల్లించేందుకైనా రెడీగా ఉందని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

IPL 2022 Mega Auction: 1214 Players Register, 49 Players Base Price At 2 Crore | Oneindia Telugu
2016 నుంచి..

2016 నుంచి..

2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్.. 63 మ్యాచ్‌ల్లో 7.80 ఎకానమీతో 59 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు 4 వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. బ్యాటింగ్ సామర్థ్య కలిగిన దీపక్ చాహర్‌కు ఇప్పటి వరకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ అప్‌కమింగ్ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా కూడా అతను రాణించే అవకాశం ఉంది. ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే తరఫునే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన దీపక్ చాహర్.. రెండేళ్ల పాటు కేవలం 5 మ్యాచ్‌లే ఆడాడు. 2018 మెగా వేలంలో ధోనీ సూచనల మేరకు దీపక్‌ను చెన్నై తీసుకోగా.. అతని రాత మారింది. ధోనీ గైడెన్స్‌లో పవర్ ప్లే బౌలర్‌గా మారిన దీపక్.. 2018‌లో 10 వికెట్లు, 2019లో 22 వికెట్లు, 2020లొ 12, 2021లో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ నాలుగేళ్లలో చెన్నై మూడు సార్లు ఫైనల్ చేరి రెండు సార్లు టైటిల్ గెలవడం విశేషం.

Story first published: Monday, January 24, 2022, 13:19 [IST]
Other articles published on Jan 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+