న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జంబలకిడిపంబ.. చెన్నై సూపర్ ‘క్వీన్స్’.. అస్సలు గుర్తుపట్టలేరు!

Deepak Chahar, Suresh Rainas female avatars unveiled as Chennai Super Kings transform into Chennai Super Queens

చెన్నై: సోషల్ మీడియా తాజా ట్రెండ్ 'జెండర్ స్వాప్' నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మగవాళ్లను, ఆడవాళ్లుగా మార్చే ఈ యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత వారం రోజులుగా భారత క్రికెటర్లకు సంబంధించిన జంబలకిడిపంబ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అస్సలు గుర్తుపట్టకుండా ఉన్న ఈ ఫొటోలు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాయి.

చహల్‌తో మొదలు..

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. రోహిత్‌పై సంధించిన ఈ వ్యంగ్యాస్త్రం ఇప్పుడు అందరిపైకి మళ్లింది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్ల జెండర్ స్వాప్ ఫొటోలు బయటకి రాగా.. తాజాగా ఈ సంప్రదాయం ఐపీఎల్‌కు కూడా పాకింది. మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జంబలకిడిపంబ టీమ్ చెన్నై సూపర్ క్వీన్స్‌ను ట్వీట్ చేసింది. ‘మా క్వీన్స్ మీ అందరి ప్రేమలను అందుకోవడానికి అర్హురాళ్లు'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

అమలాపాల్‌లా దీపక్..

సీఎస్‌కే షేర్ చేసిన ఈ జెండర్ స్వాప్ ఫొటో‌లో.. మిచెల్ సాంట్నర్, ఫాఫ్ డూప్లెసిస్, దీపక్ చహర్ అందంగా ఉన్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఎవరూ ఏ ఆటగాళ్లని కనిపెట్టడం కొంత చాలెంజింగ్‌గానే ఉంది. ధోనీ, రైనా, వాట్సన్, రాయుడు, జాదవ్, శార్దుల్ ఠాకుర్, జడేజా, ఫాఫ్ డూప్లెసిస్, దీపక్ చాహల్, సాంట్నర్, ఎంగిడి, బ్రావోల ఫొటోలను సీఎస్‌కే స్వాప్ చేసింది. ఇక దీపక్ చాహర్ అయితే అబ్బాయిల మనసులను దోచేస్తున్నాడు. మోస్ట్ బ్యూటీఫుల్ ఫిగర్ అంటూ కొనియాడుతున్నారు. సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అమలాపాల్‌లా దీపక్ చహర్, కాదల్ సంతీయాలా జడేజా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

కుదిరితే కప్ కాఫీ..

కుదిరితే కప్ కాఫీ..

ఈ పోస్ట్‌పై స్పందించిన రైనా ‘హహహ.. నేను, శార్దూల్‌ త్వరలోనే కాఫీకి వెళతాం'అంటూ కామెంట్‌ చేశాడు. అలాగే ప్రియాంక రైనా కూడా ఉండే ఉంటుందన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవల సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సైతం తమ జెండర్ స్వాప్ ఫొటోలు చూసుకొని తెగ సంబరపడిపోయారు.

రోహితా.. సో క్యూట్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ట్రోల్ చేసే క్రమంలో.. ఈ జెండర్ స్వాప్ యాప్‌ను ఉపయోగించిన చహల్.. రోహిత్ ఫొటోను అమ్మాయిలా మార్చి.. ట్వీట్ చేశాడు. మేల్, ఫిమేల్ వర్షన్ ఫొటోలను పక్కపక్కనే పెట్టి షేర్ చేశాడు. దీనికి ‘రోహితా చూడటానికి చాలా అందంగా ఉన్నావు. లవ్‌యూ'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

Story first published: Thursday, June 25, 2020, 18:50 [IST]
Other articles published on Jun 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X