Deepak Chahar: ధోనీ చెప్పిన ఆ సూత్రంతోనే భారత్‌ను గెలిపించా!

కొలంబో: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్‌లను ముగించే విధానాన్ని దగ్గరగా చూడటం తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, అదే శ్రీలంకపై విన్నింగ్ నాక్ ఆడేలా చేసిందని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్(69 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టాపార్డర్ విఫలమైన వేళ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దీపక్ చాహర్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
అయితే ఈ విన్నింగ్ నాక్‌కు ధోనీనే కారణమని తెలిపాడు. చేజింగ్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలని ధోనీ పదే పదే చెప్పేవాడని, ఆ సూత్రంతోనే ఈ మ్యాచ్‌లో రాణించాన్నాడు. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన దీపక్ చాహర్.. తన తండ్రే తన మొదటి కోచ్ అని స్పష్టం చేశాడు.

ధోనీ ప్రభావంతోనే..
'ధోనీ మ్యాచ్‌లను ముగించే విధానాన్ని చూడటం నాపై తీవ్ర ప్రభావం చూపింది. సుదీర్ఘ కాలంగా అతను మ్యాచ్‌లను ఫినిష్ చేయడం చూశాను. అతనితో ఎప్పుడూ మాట్లాడినా మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని చెబుతాడు. ప్రతీ ఒక్కరు మేం గెలవాలని కోరుకుంటారు. కానీ మ్యాచ్ చివరి వరకు వెళ్తే అది థ్రిల్లింగ్‌గా ఉంటుంది'అని చాహర్ చెప్పుకొచ్చాడు.
ఇక ప్రజలు తనను ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తారా? లేదా? అన్నది తనకు అవసరమని, తాను మాత్రం ఎప్పుడూ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తూనే ఉంటానని తెలిపాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సహకరించేందుకైనా తాను మెరుగవుతానన్నాడు.

నా తండ్రే నా కోచ్..
తన తండ్రే మొదటి కోచ్ అని, ఈ బ్యాటింగ్ క్రెడిట్ ఆయనేదని స్పష్టం చేశాడు.'నేను బ్యాటింగ్‌పై ఎప్పుడూ దృష్టిసారిస్తూనే ఉంటాను. నా తండ్రే కోచ్. ఆయనతో మాట్లాడిన ప్రతీసారి నా బ్యాటింగ్ గురించి చర్చించుకుంటాం. ఇక ప్రజలు నన్ను ఆల్‌రౌండర్‌గా ట్రీట్ చేస్తారా? లేదా? అనేది నాకు అనవసరం.
నాతో పాటు ఆడుతున్న బ్యాట్స్‌మన్‌కు నేను అండగా ఉంటాననే భరోసా ఇవ్వడం ముఖ్యం. వికెట్ సమర్పించకోకుండా క్రీజులో ఉంటే సహచర బ్యాట్స్‌మన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది'అని చాహర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ ఫార్మూలా..
ఇక ఛేజింగ్‌లో ప్రతికూలత పరిస్థితులు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకువెళ్లాలని ధోనీ ఎప్పుడూ చెబుతుంటాడు. క్రీజులో పాతుకుపోవడానికి సమయం తీసుకోవాలంటాడు. ధోనీ చెప్పినట్లు చేస్తే ప్రత్యర్థి జట్టు తమ మెరుగైన బౌలర్లను ముందుగానే ఉపయోగిస్తుంది.
అంతేకాకుండా చివర్లో బౌలర్లపై ఒత్తిడి నెలకొని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వారి తప్పులను బ్యాట్స్‌మన్ అనుకూలంగా మార్చుకోగలిగితే బిగ్ షాట్స్‌తో సులువుగా మ్యాచ్‌ను ముగించవచ్చు. ధోనీ తన కెరీర్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. 2019 ప్రపంచప్ సెమీఫైనల్లో కూడా ఇదే ఫార్మాలాను ఉపయోగించాలనుకున్నా.. రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. లేకుంటే ఆ మ్యాచ్‌లో సైతం మహీ అద్భుతం చేసేవాడని అతని అభిమానుల విశ్వాసం.

థ్రిల్లింగ్ విక్టరీ..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.
ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications