Deepak Chahar: కంటతడిపెట్టిన భారత నయా ఆల్‌రౌండర్! గెలిపించలేకపోయాననే బాధతో.. (వీడియో)

కేప్‌టౌన్: ఆఖరి వన్డేలోనైనా విజయంతో సౌతాఫ్రికా పర్యటనను ముగిద్దామని భావించిన భారత్‌కు కలిసిరాలేదు. సఫారీల ముందు టీమిండియా ఆటలు సాగలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌నూ 2-1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కావడంతోనే క్లీన్‌స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 5 బౌండరీలతో 2 సిక్స్‌లతో 54) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్‌ను ఎంగిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు. దాంతో దీపక్ చాహర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
కన్నీళ్లను ఆపుకోలేక..
అనవసర షాట్‌తో ఔటై జట్టును గెలిపించలేకపోయాననే బాధలో ఉబికి వస్తున్న కన్నీళ్లను దీపక్ చాహర్ ఆపుకోలేకపోయాడు. చేతులను అడ్డుపెట్టుకొని కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అతనికి కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దీపక్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమి కారణమైంది. చివరి 5 బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉండగా.. యుజ్వేంద్ర చాహల్ క్యాచ్ ఔట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
నయా ఆల్‌రౌండర్..
భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్.. అటు బంతితో పాటు బ్యాట్‌తో మెరిసాడు. దాంతో దీపక్ చాహర్ నయా ఆల్‌రౌండర్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. దీపక్ చాహర్ కేప్ టౌన్‌లో టీమిండియాను గెలిపించకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. చాహర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడని నిరూపించాడని, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

కోహ్లీ, ధావన్ రాణించినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ ( 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 124) సెంచరీ సాధించాడు. డసెన్ (59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 5 ఫోర్లతో 65), శిఖర్ ధావన్(73 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) అర్ధసెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications