Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI: ప్రియాన్ష్ ఆర్య క్లీన్ బౌల్డ్.. దీపక్ చాహర్ రియాక్షన్ వైరల్!(వీడియో)

పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను ముంబై ఇండియన్స్ పేసర్ దీపక్ చాహర్ ప్లాన్ చేసి మరి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీపక్ చాహర్ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన ప్రియాన్ష్ ఆర్య.. అతని ఉచ్చులో పడి మూల్యం చెల్లించుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తన వ్యూహం ఫలించడంతో దీపక్ చాహర్ సంతోషంతో ఎగిరి గంతేసాడు. తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇన్‌స్వింగర్‌తో బోల్తా..

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా దీపక్ చాహర్ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని దీపక్ చాహర్ అత్యంత వేగంగా ఇన్‌స్వింగర్ వేసాడు. లెగ్ స్టంప్ లైన్‌లో పడిన ఈ బంతి ఆడకుండా ప్రియాన్ష్ ఆర్య ముందుకు జరగ్గా.. లెగ్ స్టంప్‌కు అతీ సమీపంగా బంతి బౌండరీకి దూసుకెళ్లింది. మరుసటి బంతిని కూడా అదే తరహాలో ఇన్‌స్వింగర్ వేసిన దీపక్ చాహర్.. ఈసారి వేగం తగ్గించాడు.

Deepak Chahar Icy Celebration Goes Viral After Deceiving Priyansh Arya with Masterful Variation IN MI vs PBKS Match

ఈ విషయాన్ని పసిగట్టలేకపోయిన ప్రియాన్ష్ ఆర్య లాఫ్టెడ్ డ్రైవ్ ఆడబోయాడు. కానీ బ్యాట్ అడ్వాన్స్ కావడంతో మిస్సైన బంతి లెంగ్ స్టంప్‌‌ను లేపేసింది. తన ప్లాన్ వర్కౌట్ కావడంతో దీపక్ చాహర్ సంతోషంతో ఎగిరి గంతేసాడు. తన చేతులతో పేస్ వేరియషన్స్ అని సైగలు చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

పంజాబ్ 200/8

ముంబై ఇండియన్స్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్(4/39), దీపక్ చాహర్(2/36) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. కార్బిన్ బోష్, రాజ్ బావకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేసారు. లేకుంటే పంజాబ్ ఇంకా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.

Story first published: Thursday, May 14, 2026, 23:01 [IST]
Other articles published on May 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+