
నన్ను నమ్మి బాధ్యత
"ఒత్తిడిలో నన్ను నమ్మి బాధ్యతను అప్పగించడాన్ని ఎంతో ఆస్వాదించాను. నన్ను ఎవరూ విశ్వసించనప్పుడు నేను బాధపడతాను. అయితే, కెప్టెన్ నుండి ఆ విశ్వాసాన్ని పొందడంతో మంచి ప్రదర్శన చేశాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు. అతడు ఈ ఫార్మాట్లో నంబర్ 1 బౌలర్. అతడి పేస్ లేదా కంట్రోల్ అయినా ప్రతిదీ కలిగి ఉన్నాడు" అని బుమ్రా గురించి తెలిపాడు.

బుమ్రాతో పోటీపడటం లేదు
"నేను బుమ్రాతో పోటీపడటం లేదు. నా పని బాగా ప్రదర్శించడమే. ఆటపై దృష్టి పెట్టాలి... జట్టు గెలిపించడంపైనే నా తొలి ప్రాధాన్యత. టీ20 వరల్డ్‌కప్‌కు మరో 11 నెలల సమయం ఉంది. ఈ ట్రోఫీని గెలవాలని కృషి చేస్తున్నాం. అంతకంటే ముందు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి" అని దీపక్ చాహర్ తెలిపాడు.
సచిన్ మళ్లీ పుట్టాడు!: క్లబ్ క్రికెటర్లను మించి డైపర్ బుడతడి వీడియో వైరల్

ప్రతి మ్యాచ్ నాకు ఎంతో కీలకం
"ఐపీఎల్ కూడా ఉంది. వీటిపై కూడా దృష్టి సారించాలి. జట్టు యాజమాన్యం నాపై మరింత నమ్మకం పెంచుకోవాలని శ్రమిస్తున్నా. ప్రతి మ్యాచ్ నాకు ఎంతో కీలకం. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చాహర్ తెలిపాడు.

తొలి భారత బౌలర్‌గా దీపక్ చాహర్ చరిత్ర
నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్(3.2-0-7-6) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.


Click it and Unblock the Notifications
