Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలి: మాజీ క్రికెటర్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడం కంటే జట్టు ప్రదర్శనను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికాడు. ప్రస్తుతం భారత జట్టు పరివర్తన దశలో ఉందని, జట్టు పురోగతి స్థిరంగా ఉండాలని చెప్పాడు.

IND vs SL: సరాన్ష్ జైన్ ఇన్.. మ్యాచ్ విన్నర్ ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్ ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs SL: సరాన్ష్ జైన్ ఇన్.. మ్యాచ్ విన్నర్ ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్ ఆడే భారత తుది జట్టు ఇదే!

గతేడాది సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ అయిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ తదుపరి 9 టెస్ట్‌ల్లో ఏడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 9 మ్యాచ్‌ల్లో భారత్.. శ్రీలంక, న్యూజిలాండ్‌తో విదేశాల్లో రెండేసి టెస్ట్‌ల సిరీస్ ఆడనుండగా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.

Deep Dasgupta Urges India to Forget WTC Final Qualification Ahead of Sri Lanka Test Series

అయితే ఈ సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించడం కష్టమని దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. శ్రీలకంతో రెండు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన దీప్‌ దాస్‌గుప్తా.. భారత ప్రదర్శనలో మెరుగుదల చూడాలనుకుంటున్నానని తెలిపాడు. భారత ఆటతీరు మెరుగవుతుందా? లేదా? అనేది చూసుకోవాలని హితవు పలికాడు.

'భారత టెస్ట్ జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు లేకపోవడం లోపంగా ఉంది. ప్రస్తుతం భారత్ టెస్ట్ టీమ్ పరివర్తన దశలో ఉంది. కానీ నిలకడగా రాణించడం చాలా ముఖ్యం. నేను చెప్పే విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు. ప్రస్తుతానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌పై మనం ఆశలు వదులుకోవాలి. దాని గురించి మర్చిపోవడం మంచిది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ గురించి మాట్లాడటం కూడా అనవసరం. నా అభిప్రాయం ప్రకారం 2020-21లో ఉన్నంత బలంగా భారత టెస్ట్ టీమ్‌ను పునర్నిర్మించాలి. అది ఎలా చేయాలనేదానిపై భారత్ ఫోకస్ పెట్టాలి.

IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

ఆ సమయంలోనే పకడ్బందీ ప్రణాళికతో భారత్.. విదేశాల్లో గెలిచి, దేశీయ సిరీస్‌ల్లో ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గురించే ఆలోచిస్తే.. మ్యాచ్‌లు గెలవడం కోసం షార్ట్‌కట్స్ వెతకవచ్చు. ఆ నిర్దిష్ట మ్యాచ్ లేదా సిరీస్‌ను గెలవడానికి తాత్కలిక మార్గాలనే చూస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపై భారత్ ద‌ృష్టిసారించాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను మరిచిపోవాలి. అప్పుడే కనీసం వచ్చే ఎడిషన్‌లోనైనా మనం ఆధిపత్యం చెలాయించగలం.'అని దీప్ దాస్ గుప్తా పేర్కొన్నాడు.

Story first published: Saturday, August 1, 2026, 22:02 [IST]
Other articles published on Aug 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+