కోహ్లీ కొంచెం మర్యాదగా నడుచుకో.. చిన్న పిల్లలు చూస్తున్నారు: దీప్ దాస్‌గుప్తా

న్యూఢిల్లీ: మైదానంలో కొంచెం మర్యాదగా నడుచుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత మాజీ సెలెక్టర్ దీప్‌దాస్ గుప్తా సూచించాడు. ఎంతో మంది చిన్నారులు భారత కెప్టెన్‌ను స్పూర్తిగా తీసుకుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ఇక మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు అతని సంబరాలు బౌలర్ కంటే ఎక్కువగా ఉంటాయి.
తన దూకుడుతో కోహ్లీ ఎప్పటికప్పుడూ తన టీమ్‌లో స్పూర్తిని నింపుతుంటాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు హద్దులు ధాటి కూడా ప్రవర్తిస్తుంటాడు.సౌతాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కోహ్లీ తన హవాభావాలతో హద్దులు దాటాడు. ప్రత్యర్థి వికెట్ తీసిన ఆనందంలో నోటీపై వేలు వేసుకుంటూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

చిన్నపిల్లలు చూస్తారు..
ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కోహ్లీ మర్యదాగా నడుచుకోవాల్సి అవసరం ఉందని తన యూట్యూబ్ చానెల్ వేదికగా దీప్‌దాస్ గుప్తా తెలిపాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు. 'విరాట్ కోహ్లీ టీమిండియా అంబాసిడర్. అతన్ని ఎంతో మంది స్పూర్తిగా భావిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఆడుతున్నప్పుడు అతని ప్రభావం మరి ఎక్కువగా ఉంటుంది.
అయితే సౌతాంప్టన్‌లో అతను ఎలా ప్రవర్తించాడనే విషయం నాకు తెలియదు. కానీ అతను కొంచెం మర్యదాగా నడుచుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. దానికి నేను అంగీకరిస్తా. కొన్ని సార్లు అతను హద్దులు దాటుతాడు. ఎంతో పిల్లలు అతన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. మరెంతో మందికి చిన్నారులకు అతను రోల్ మోడల్. కాబట్టి కోహ్లీ కొంచెం హుందాగా నడుచుకోవాల్సి అవసరమైంతే ఉంది.

మరింత ఆలస్యం..
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని దీప్‌దాస్ గుప్తా అన్నాడు. 'ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం ఇద్దరు యువ ఓపెనర్లు దేవ్‌దత్, పృథ్వీషా వెళ్తారనే చర్చ వారం, పదిరోజులుగా సాగుతోంది. లంక పర్యటనలో మ్యాచ్‌లు ఆలస్యమవడంతో వాళ్లిద్దరూ ఈనెల 29 వరకు అక్కడే ఉంటారు. ఒకవేళ 30న ఇంగ్లాండ్‌కు బయలుదేరినా అక్కడ మరో పదిరోజులు హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి.

రెండు టెస్ట్‌లకు అవసరమా?
అది పూర్తయిన వెంటనే నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే వారు సన్నద్ధమవ్వడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. పడిక్కల్, షా టెస్టు క్రికెట్ ఆడి చాలా రోజులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు వెళ్లినా నాలుగో టెస్టు వరకు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు కోహ్లీసేనకు కొత్త ప్రశ్న ఎదురవుతుంది. కేవలం రెండు టెస్టుల కోసం వారిని అక్కడికి తీసుకెళ్లడం అవసరమా? అనే సందేహం తలెత్తుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సరిపడా ఓపెనర్లు ఉన్నారు' అని దీప్‌దాస్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications