India vs England: కుల్దీప్‌కు మరోసారి నిరాశే.. రెండో టెస్ట్‌లో అతనికే చోటు! భారత జట్టు ఇదే!

చెన్నై: చెన్నై వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మొదటి టెస్ట్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అండగా రాణించడంలో షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యారు. అయితే నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోయాడు.
దీంతో శనివారం నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి చోటు దక్కే అవకాశం లేదని చెప్పకనే చెప్పాడు.
నాలుగు వికెట్లు తీసినా
చెపాక్ పిచ్‌పై షాబాజ్ నదీమ్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లు వేసిన నదీమ్.. 3.80 ఎకానమీతో 167 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసి.. 4.40 ఎకానమీతో 66 పరుగులిచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లో నదీమ్ డకౌట్ అయ్యాడు. మొత్తంగా తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇంగీష్ బ్యాట్స్‌మన్‌పై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. తొలి టెస్ట్ ప్రదర్శన కారణంగా నదీమ్‌కు రెండో టెస్టులో చోటు దక్కకపోవడం దాదాపు ఖాయం అయిపొయింది.

అక్షర్ ఫిట్‌నెస్ సాధిస్తే
షాబాజ్ నదీమ్ స్థానంకు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పోటీలో ఉన్నారు. రెండో టెస్టులో కుల్దీప్‌కు బదులు అక్షర్ తుది జట్టులో చోటు దక్కించుకునే ఎవకాశాలే ఎక్కువగా ఉన్నాయని దీప్ దాస్‌గుప్తా అంటున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... 'చెపాక్ మైదానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో టెస్ట్ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తే.. నదీమ్ స్థానంలో జట్టులోకి వస్తాడు. తుది జట్టులో మరో మార్పు ఉండదని అనుకుంటున్నా. అక్షర్ వస్తే.. భారత బ్యాటింగ్ లైనప్ కూడా బలోపేతం అవుతుంది' అని అన్నాడు. నిజానికి అక్షర్ మంచి బ్యాట్స్‌మన్. లోయర్ ఆర్డర్‌లో అతడు చేసే పరుగులు జట్టుకు ఉపయోగపడతాయి.

షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ జట్టులో కొనసాగనున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ బాగానే ఆడుతున్నప్పటికీ పరుగులను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నారు. రెండో టెస్టులో వీరిద్దరూ మూడు, నాలుగు స్థానాల్లో దిగుతారు. ఆస్ట్రేలియాలో జట్టును విజయ పథాన నడిపించి చిరస్మరణీయ విజయాన్ని అందించిన అజింక్య రహానే రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు.
అయినప్పటికీ కేఎల్ రాహుల్‌కు కాకుండా రహానేకే కోహ్లీ ఓటేసే అవకాశం ఉంది. రిషభ్ పంత్ ఫామ్‌లో ఉండడంతో వృద్ధిమాన్ సాహాకు నిరాశ తప్పదు. మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తున్న వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 85 పరుగులు చేశాడు. ఆరు వికెట్లతో ఇంగ్లండ్ గుండెల్లో గుబులు రేపిన రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. మహ్మద్ షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు రాణిస్తుండడంతో షమీకి రెండో టెస్టులో అవకాశం లేనట్టే.

భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
మరో టీ20 లీగ్.. ఐపీఎల్ కంటే మేటిగా! బాలీవుడ్ స్టార్ల ఆసక్తి!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications