For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: 9 ఏళ్ల తర్వాత సెంచరీ!

సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. సొంతగడ్డపై భారత్‌తో టెస్ట్‌ల్లో 9 ఏళ్ల తర్వాత శతకం బాదిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శతకం సాధించడం ద్వారా డీన్ ఎల్గర్.. ఈ ఫీట్ సాధించాడు. 2014లో చివరిసారిగా భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ సెంచరీ సాధించాడు.

ఇక డీన్ ఎల్గర్‌కు ఇది ఫేర్‌వెల్ సిరీస్ కావడం మరో విశేషం. బ్యాటింగ్‌కు కఠినమైన పిచ్‌పై ఎల్గర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓవైపు వికెట్లు పడినా.. మరోవైపు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచి 140 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. టెస్ట్ కెరీర్‌లో ఎల్గర్‌కు ఇది 14వ శతకం. కెరీర్‌లో చివరి సిరీస్ ఆడుతున్న ఎల్గర్ ఈ శతకంతో తెగ సంతోషపడ్డాడు. శతకం సాధించిన ఎల్గర్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.

Dean Elgar becomes first proteas batter to scored Hundred vs India After 9 years in South Africa

ఎల్గర్ శతకంతో సౌతాఫ్రికా భారీ దిశగా దూసుకెళ్తోంది. రెండో సెషన్ ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. క్రీజులో డీన్ ఎల్గర్‌(127 బ్యాటింగ్)‌తో పాటు డేవిడ్ బెడింగ్‌హమ్(49) ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(5)తో పాటు కీగన్ పీటర్సన్(2), టోనీ డీ జోర్జీ(28) విఫలమయ్యారు. అంతకుముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత 245 పరుగులకు కుప్పకూలింది.

మహమ్మద్ సిరాజ‌తో 9వ వికెట్‌కు 47 పరుగులు జోడించిన రాహుల్.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. వేగంగా పరుగులు చేసిన రాహుల్.. సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, December 27, 2023, 20:24 [IST]
Other articles published on Dec 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+