Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత!

DD vs RR: Ravi Ashwin Picks 250 Wickets In T20 Cricket Fewest To Get It

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిన అశ్విన్.. తద్వారా టీ20 క్రికెట్‌లో 250 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న మూడో స్పిన్నర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 254 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. అంతర్జాతీయ టీ20ల్లో 52, ఐపీఎల్‌లో 140, ఇతర దేశవాళీ మ్యాచ్‌ల్లో మిగిలిన వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కన్నా ముందు పియూష్ చావ్లా, అమిత్ మిశ్రా ఈ ఘనతను అందుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉన్నాడు. 170 వికెట్లతో లసిత్ మలింగా అగ్రస్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా(160), పియూష్ చావ్లా(156), డ్వేన్ బ్రావో(154), హర్భజన్ సింగ్(150) అశ్విన్ కన్నా ముందున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 43), రిషభ్ పంత్(24), షిమ్రన్ హెట్‌మైర్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/22), చేతన్ సకారియా (2/33) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగీ చెరొక వికెట్ పడగొట్టారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ లివింగ్ స్టోన్(1), యశస్వీ జైస్వాల్(5) తీవ్రంగా నిరాశపరిచారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్, అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో జైస్వాల్(5) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టెప్ ఔటైన మిల్లర్.. స్టంపౌటయ్యాడు. దాంతో రాజస్థాన్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సంజూ శాంసన్(14 నాటౌట్), మహిపాల్ లోమ్‌రర్(18 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 రన్స్ చేసింది.

Story first published: Saturday, September 25, 2021, 18:45 [IST]
Other articles published on Sep 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+